డబుల్ ఎలిమినేషన్ అంతా ఉత్తిదే.. దాని వెనుకున్న అసలు గుట్టు ఇదే!!

బిగ్‌బాస్ రెండో వారంలో రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరిగాయి.. అందుకే ఈసారి డబుల్ ఎలిమినేషన్ అంటూ నాగార్జున ఓ బాంబ్ వేశాడు. అయితే నాగ్ ప్రకటన వెనుకున్న మర్మాన్ని తెలుసుకోలేనంత అమాయకులెవ్వరూ లేరు. సోషల్ మీడియాలో అసలు గుట్టు రట్టైంది. డబుల్ ఎలిమినేషన్ అంటూ అందులో ఒకరైన కరాటే కళ్యాణిని బయటకు పంపించారు. అయితే ఆదివారం జరిగే ఎపిసోడ్‌లో మరో కంటెస్టెంట్‌ను కూడా ఎలిమినేట్ చేస్తామని నాగ్ ప్రకటించాడు.

Recommended Video

Bigg Boss Telugu 4: Karate Kalyani అవుట్, డబుల్ ఎలిమినేషన్ ఉత్తిదే.. సీక్రెట్ రూంలో హారిక!!
రసవత్తరంగా సాగిన షో..

రసవత్తరంగా సాగిన షో..

రెండో వీకెండ్‌లో నాగార్జున అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. సేఫ్ గేమ్ ఆడుతున్నారా? నామినేషన్ అంటే అంత చులకనా? అని ఒక్కొక్కరి తాటదీశాడు. మధ్యలో నవ్వాడని కుమార్ సాయిని సపరేట్‌గా ఏసుకున్నాడు. అభిజీత్‌ను సైతం ఓవర్ కాన్ఫిడెంటా? అంటూ మందలించాడు. కంటెస్టెంట్లందరి నిజ స్వరూపాలను బయటకు తెచ్చేందుకు హీరో, జీరో గేమ్ ఆడించాడు నాగ్. దాంతో షో రసవత్తరంగా సాగింది

అమ్మ రాజశేఖర్ ఎమోషనల్..

అమ్మ రాజశేఖర్ ఎమోషనల్..

జీరో, హీరో ఆటలో లాస్య చేసిన పనికి అమ్మ రాజశేఖర్ ఏడ్చేశాడు. అమ్మ రాజశేఖర్ జీరో అని చెబుతూ.. కొన్ని కారణాలు వివరించింది. దివితో ప్రవర్తించిన విషయం తనకు నచ్చలేదని తెలిపింది. ఇక ఆ ఆరోపణలతో మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. అయితే దివి మాత్రం అందుకు భిన్నంగా మాస్టర్ హీరో అని పేర్కొంది. ఈ ఘటన మొత్తం ఎపిసోడ్‌కే హైలెట్ అయింది.

డబుల్ ఎలిమినేషన్..

డబుల్ ఎలిమినేషన్..

డబుల్ ఎలిమినేషన్ అని చెబుతూ.. కరాటే కళ్యాణిని బయటకు తీసుకొచ్చారు. ఇక నేటి ఎపిసోడ్‌లో ఆమె స్టేజ్ మీదకు వస్తుంది. కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది. అంత వరకు ఓకే. ఇక డబుల్ ఎలిమినేషన్ అని కంటెస్టెంట్లు, ప్రేక్షకుల్లో ఓ గజిబిజిని క్రియేట్ చేశారు.

అసలు గుట్టు ఇదే..

అసలు గుట్టు ఇదే..

ఇక ఈ డబుల్ ఎలిమినేషన్ అది ఫేక్ టాక్ నడుస్తోంది. గత సీజన్లో రాహుల్ సిప్లిగంజ్‌ను ఫేక్ ఎలిమినేట్ చేసి.. సీక్రెట్ రూంలో ఉంచారు కదా. అలాగే ఇప్పుడు హారికను కూడా అలాగే ఫేక్ ఎలిమినేషన్ పేరిట సీక్రెట్ రూంలో ఉంచబోతోన్నారని తెలుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X