అతనా? ఆమెనా?.. ఎలిమినేషన్‌లో అసలు మజా.. చూస్తారుగా బిగ్‌బాస్ ఆడించే ఆట!!

బిగ్‌బాస్ షోలో లీకుల పర్వంలో అనేది అంతర్లీనంగా సాగుతూనే ఉంటుంది. అధికారకంగా కనిపించే అనధికారిక సమాచారంతో బిగ్‌బాస్ షోలో ఉన్న మజా మాయం అవుతూ ఉంటుంది. ఒక్క మొదటి సీజన్ తప్పా మిగిలిన అన్నింటిలో లీకులు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. నాల్గో సీజన్‌ కూడా లీకుల బారిన పడింది. కంటెస్టెంట్ల పేర్లు కూడా సోషల్ మీడియాలో ముందుగానే హల్చల్ చేశాయి. ఇక షో మొదలెట్టాక వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎలిమినేషన్‌లు ఇలా ప్రతీ ఒక్కటీ లీకవుతూనే ఉన్నాయి. అయితే ఈ మూడో వారం మాత్రం బిగ్‌బాస్ అందర్నీ ఓ ఆట ఆడించేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Devi Nagavalli ఎలిమినేటేడ్!
మొదటి రెండు ఎలిమినేషన్స్ అలా..

మొదటి రెండు ఎలిమినేషన్స్ అలా..

నాల్గో సీజన్‌లో మొదటి రెండు ఎలిమినేషన్స్ విషయంలోనూ లీకులు అందించిన సమాచారం నిజమైంది. సూర్య కిరణ్, కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యారని షో ప్రసారం చేయకముందే వార్తలు బయటకు వచ్చాయి. ఇక రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ అంటూ బురిడి కొట్టిద్దామని చూసినా అది ఫేక్ ఎలిమినేషన్ అంటూ ముందే పసిగట్టేశారు అందరూ.

మూడో వారంలో రచ్చ..

మూడో వారంలో రచ్చ..

అయితే లీకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మూడో వారంలో ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ పేరు శనివారం సాయంత్రమే బయటకు వచ్చింది. మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడని శనివారం సాయంత్రం లీకైంది. ఈ మేరకు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరిగింది.

మళ్లీ అలా..

మళ్లీ అలా..

అయితే అలా మెహబూబ్ పేరు బయటకు వచ్చిందో లేదో.. కాసేపటి తరువాత దేవీ నాగవల్లి పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. మూడో వారంలో ఎలిమినేట్ అయింది దేవీ నాగవల్లి అంటూ ప్రచారం ఊపందుకుంది. ఇక ఇలా ఇద్దరి పేర్లు లీకవ్వడం వెనుక బిగ్ బాస్ హస్త ఉందని తెలుస్తోంది. లీకు వీరుల పని పట్టేందుకు ఇలా ఎత్తుగడ వేసి ఉంటాడని తెలుస్తోంది.

 దేవీ నాగవల్లి అవుట్..

దేవీ నాగవల్లి అవుట్..

అయితే మరి ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారనే విషయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ట్రెండ్‌, ఓటింగ్ సరళిని బట్టి చూస్తే టాస్క్‌లో అతి చేయడం వల్ల మెహబూబ్ ఎలిమినేట్ అవుతాడని, అయ్యాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా దేవీ నాగవల్లి ఎలిమినేట్ అయిందని తెలుస్తోంది.

ఆరియానాను సేవ్ చేసింది..

ఆరియానాను సేవ్ చేసింది..

దేవీ నాగవల్లి ఎలిమినేట్ కావడమే కాకుండా.. బిగ్ బాంబ్ ద్వారా ఆరియానా వచ్చే వారం నామినేషన్ నుంచి కాపాడిందని టాక్ నడుస్తోంది. మరి చూడాలి వీటిలో ఏ వార్తలు నిజమవుతాయో. ఆదివారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందా? అని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X