బిగ్‌బాసూ ఇది కదా ప్రేక్షకులు కోరుకునేది.. అసలైన ఆట ఆరంభం.. మనుషులు-రోబోల సమరం
బిగ్‌బాస్ షో మొదలైంది.. రెండు ఎలిమినేషన్స్.. రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. ఇద్దరు కెప్టెన్‌లు ఎన్నికయ్యారు. ఇలా చాలా జరిగిపోతున్నాయి. కానీ ఒక్కటి మాత్రం ఇంత వరకు జరగనే లేదు. అదే ఫిజికల్ టాస్క్. ఇంత వరకు ఇంటి సభ్యులకు ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన టాస్క్ ఇవ్వలేదు. అయితే ఈ మూడో వారం మాత్రం బిగ్‌బాస్ తన పంథాను మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇక నుంచి అన్ని వ్యూహాలు మారిపోబోతోన్నట్టు తెలుస్తోంది.

మూడో వారం రచ్చ..
బిగ్‌బాస్ షో మూడో వారంలో అడుగుపెట్టడంతోనే ఓ కొత్త ఊపు వచ్చింది. నామినేషన్ ప్రక్రియతోనే అసలు సంగతి తేల్చేశాడు. ఈ వారం ఎలా ఉండబోతోందో ఓ చిన్న హింట్ ఇచ్చేశాడు. ఇన్నాళ్లు అతుక్కుని తిరిగిన వారు దూరంగా ఉండబోతోన్నారు. ఈ మూడో వారంలో ఎవరికి ఎవరు దగ్గరవుతారో ఎవరికి ఎవరు దూరమవుతారో చూడాలి.

నామినేషన్‌లో ఫైర్...
మూడో వారం నామినేషన్‌కు సంబంధించిన ప్రక్రియలో బిగ్ బాస్ మంట పెట్టాడు. కంటెస్టెంట్లందరూ ఇద్దరిని నామినేట్ చేయాలని, అందుకు తగ్గ కారణాలు వివరించాలని తెలిపాడు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దూషణలకు, ఆరోపణలకు దిగారు. అప్పటి వరకు స్నేహితుల్లా ఉన్న ఆరియానా-సోహెల్, అభిజీత్-సుజాతల మధ్య విబేధాలు వచ్చాయి. హారిక మెహబూబ్‌లు, అఖిల్-కుమార్ సాయి-సోహెల్ మాటల యుద్దానికి దిగారు.

ఆ ఏడుగురిలో ముగ్గురు డేంజర్ జోన్‌లో..
మూడో వారానికి గానూ ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. ఇందులో దేవీ నాగవల్లిని బిగ్ బాంబ్ ద్వారా కరటే కళ్యాణి నేరుగా నామినేట్ చేసింది. నోయల్ తన కెప్టెన్ అధికారాన్ని ఉపయోగించి లాస్యను నేరుగా నామినేట్ చేశాడు. ఇక ఆరియానా, కుమార్ సాయి, మెహబూబ్, హారిక ,మోనాల్‌లు నామినేట్ అయ్యారు. ఈ అందరిలోనూ కుమార్ సాయి, ఆరియానా, మోహబూబ్ డేంజర్ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
Recommended Video

మనుషులు-రోబోల సమరం..
ఇక నేడు బిగ్‌బాస్ అదిరిపోయే టాస్క్‌ను ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంటి సభ్యులందర్నీ రెండు టీంలుగా విడగొట్టినట్టు తెలుస్తోంది. అందులో మనుషులు, రోబోలుగా విడిపోయి.. ఎవరి ప్రాణాలను వారు కాపాడుకోవాల్సి ఉంటుంది. ఉక్కు హృదయం అంటూ రోబోల ప్రాణాలను ఉక్కు బాల్స్‌లో పెట్టాడు. ఇక వాటిని రక్షించుకునేందుకు రోబోల టీం కంటెస్టెంట్లు మిగతా ఇంటి సభ్యులపై విరుచుకుపడుతున్నట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ మొదటి ఫిజికల్ టాస్క్.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉంది. ఇక ఈ రోజు నుంచి అసలైన ఆట ఆరంభం కానుంది.


Click it and Unblock the Notifications











