చిచ్చుపెట్టిన నామినేషన్స్.. అమ్మ రాజశేఖరూ.. మెహబూబ్‌ను భలే చెడగొడుతున్నావే..!!
బిగ్‌బాస్ తెలుగు నాల్గో సీజన్ రోజులు గడుస్తున్న కొద్దీ.. ముందుకు సాగుతున్న కొద్దీ రసవత్తరంగా మారుతోంది. గ్రూపులు కట్టడం, ఒకరి వెనుక మరొకరు ముచ్చట్లు పెట్టడం, లవ్ ట్రాక్‌లు నడిపించడం ఇలా ఎన్నెన్నో నడుస్తున్నాయి. ఇక నాల్గో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియలో కొన్ని విషయాలు బయట పడ్డాయి. ఎవరు ఎలాంటి వారు ఎవరు ఎవరిని కట్టడి చేస్తున్నారు.. ఎవరి మనసులో ఎలాంటి ఆలోచనలున్నాయనే విషయాలు బయటపడ్డాయి.

హిట్‌మ్యాన్స్, డెన్...
నాల్గో వారం నామినేషన్ ప్రక్రియ కోసం ఓ డెన్‌ను ఇద్దరు హిట్ మ్యాన్స్‌ను(అఖిల్, సోహెల్) ఏర్పాటు చేశాడు బిగ్‌బాస్. ఈ ఇద్దరితో మిగిలిన కంటెస్టెంట్లు ఎవరో ఒకరిని చంపే డీల్ పెట్టుకోవచ్చని తెలిపాడు. అందుకోసం లివింగ్ రూంలో ఉన్నవాళ్లంతా బజర్ మోగిన ప్రతీసారి డెన్‌లోకి ప్రవేశించాలి. అలా మొదట ఎవరు ప్రవేశిస్తే వారికే డీల్ కుదుర్చుకునే అవకాశం వస్తుందన్నాడు. ఇలా ఐదు సార్లు బజర్ మోగుతుందని తెలిపాడు.

మెహబూబ్, హారికలు..
ఇలా ఐదు బజర్స్ మోగగా.. అందులో మెహబూబ్, హారికలు కూడా డెన్‌లోకి వచ్చారు. మొహబూబ్ డెన్‌లోకి వచ్చినప్పుడు అభిజీత్‌ను చంపేందుకు డీల్ కుదుర్చుకున్నాడు. మనం చేస్తే గల్లీ ఫైట్స్ అన్నాడు.. దివిని మాత్రం అలా చేశాడంటూ కారణం చెబుతూ అభిని నామినేట్ చేశాడు.

హారిక సైతం..
మెహబూబ్ తరువాత హారిక డెన్‌లోకి ప్రవేశించింది. మెహబూబ్‌ను చంపేందుకు హారిక డీల్ కుదుర్చుకుంది. టాస్క్‌లో అగ్రెసివ్‌గా ప్రవర్తిస్తున్నాడు. మాటలు తూలుతున్నాడు.. అవినాష్‌పైకి వచ్చాడంటూ తన కారణాలేవో తాను చెప్పి మెహబూబ్‌ను నామినేట్ చేసేసింది.
Recommended Video

మెహబూబ్‌ను ప్రభావితం..
అయితే హారికను తనను ఎలాగైనా నామినేట్ చేస్తుందని ముందే ఊహించిన మెహబూబ్‌కు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదు. అయితే హారిక తన కారణాలను చెప్పినా కూడా.. అమ్మ రాజశేఖర్ మాత్రం వాటిని మార్చేశాడు. మెహబూబ్ మైండ్‌ను ప్రభావితం చేసే మాటలు చెబుతున్నాడు. ఆమె చెప్పిన కారణాలే కరెక్ట్ కాదు.. నువ్ అభిని నామినేట్ చేశావ్ అందుకు హారిక నిన్ను నామినేట్ చేసిందని సింపుల్‌గా చెప్పి మెహబూబ్ మైండ్‌ను అమ్మ రాజశేఖర్ వాష్ చేశాడు. మెహబూబ్ కూడా మాస్టర్ చెప్పిన మాటలకు ప్రభావితమైనట్టే కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











