ఇది కదా కావాల్సింది.. గట్టిగా ఇచ్చిపడేశాడు.. అభిజిత్-అఖిల్ మాటల యుద్దం
బిగ్‌బాస్ ఇంట్లో నాల్గో వారం గడిచిపోయింది. శనివారం నాటి ఎలిమినేషన్, ఆదివారం నాటి ఎంటర్టైన్మెంట్‌తో అలా నాల్గో వీకెండ్‌కు ఎండ్ కార్డ్ పడింది. ఐదో వారంలో ఇలా అడుగుపెట్టింది. సోమవారం అంటే నామినేషన్ ప్రక్రియ ఉంటుందన్న సంగతి తెలిసిందే. నామినేషన్స్ అంటే జరగాల్సిన గొడవలు, ఉండాల్సిన మజా ఇంత వరకు రాలేదు. కానీ మొదటిసారిగా ఈ ఐదో వారంలో నామినేషన్ ప్రక్రియ వేడెక్కబోతోన్నట్టు తెలుస్తోంది.

కోల్డ్ వార్..
అభిజిత్ అఖిల్ మోనాల్ ట్రయాంగిల్ కథ అందరికీ తెలిసిందే. మోనాల్ ఆ ఇద్దరితో క్లోజ్‌గానే ఉంటుంది. కానీ ఆ ఇద్దరూ మాత్రం శత్రువుల్లా మారిపోయార. మొదటగా స్నేహితుల్లా బాగానే ఉన్నాగానీ మోనాల్ ఆట వల్ల ఇద్దరూ దూరమైపోయారు. ఇప్పుడు ఒకరంటే ఒకరికి పడటం లేదు.

అక్కడ ఒకలా.. ఇక్కడ మరోలా..
మోనాల్ ఈ ఇద్దరితో ఆడుతోందని చూసేవాళ్లకు ఇట్టే అర్థమైపోతుంది. ఎందుకంటే అభిజిత్‌తోనూ అఖిల్‌తోనూ మోనాల్ క్లోజ్‌గా మూవ్ అవుతూ ఉంటుంది. ఏ ఒక్కరో ఇష్టమైతే ఒక్కరితోనే ఉండక.. ఇద్దరితోనూ ఉంటుంది. అఖిల్ లేనప్పుడు అభితో అభి లేనప్పుడు అఖిల్‌తో ఉంటుంది. అఖిల్ కొంచెం సేపు ఎక్కువ గడుపుతుంది.

రచ్చగా మారిన వ్యవహారం..
అయితే ఈ ముగ్గురి వ్యవహారాన్ని నాగార్జున గెలికాడు. నాగ్ అడగడంతో దివి చెప్పిన మ్యాటర్‌తో మోనాల్ కన్నీరు పెట్టుకుంది. అభితో అఖిల్‌తో డబుల్ గేమ్ ఆడుతోందన్నట్టుగా చెప్పడంతో మోనాల్ ఏడ్చేసింది. ఇదే వ్యవహారం నేటి నామినేషన్ ప్రకియలో మళ్లీ చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

అఖిల్‌పై వార్..
నామినేషన్ ప్రక్రియలో భాగంగా అభి అఖిల్ పేరున చెప్పినట్టు తెలుస్తోంది. ఇక కారణాలు చెప్పడంతో అఖిల్ మాటల యుద్దానికి దిగినట్టు తెలుస్తోంది. నువ్ కన్ఫ్యూజ్ అవుతావ్ అని నాకు తెలుసు. కానీ పచ్చి అబద్దాలు మాట్లాడుతావని ఇప్పుడు తెలుసింది.. కళ్లు ఎగిరేసి.. అలా చూసి ఇలా చూసి మాట్లాడితే భయపడతారని అనుకోకు అని అభి గట్టిగా ఇచ్చాడు. వేలు అలా చూపించి మాట్లాడకు డూడ్ అంటూ అఖిల్ రెచ్చిపోయాడు. ప్రతీసారి నువ్ చేసేది అదే అంటూ అభి మరో కౌంటర్ వేశాడు.
Recommended Video

ఆమె గురించి నీకెందుకు
నువ్ ఆ రోజు మోనాల్ మీద కూడా అలాగే వేలు పెట్టి చూపించావ్.. అంటూ అఖిల్ రెచ్చిపోయాడు. ఆమె ఇష్యూ నీకెందుకు బ్రదర్.. అంటూ అభి మరింత ఫైర్ అయ్యాడు. అమ్మాయి గురించి అలా మాట్లాడితే.. ఆమె క్యారెక్టర్ బయటకు ఎలా వెళ్తుందో అని అఖిల్ రెచ్చిపోయాడు. అది మేము ఇద్దరం చూసుకుంటాం నీకెందుకు అంటూ అభిజిత్ రెచ్చిపోయాడు. ఇక మెనాల్ మళ్లీ ఏడుస్తూ నా పేరును మధ్యలో లాగకండి అని అరిచింది. అయితే ఇది ప్రోమో కాబట్టి ఇలా ఉంది.. పూర్తి ఎపిసోడ్‌లో ఇంత ఫైర్ ఉంటుందా లేదా అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











