Don't Miss!
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
దమ్ముంటే ఇక్కడి నుంచి నన్ను పీకు.. అఖిల్‌కు అభి సవాల్.. ఎవ్వరూ తగ్గడం లేదుగా.. !!
బిగ్‌బాస్ షోలో నేడు ఇళ్లు దద్దరిల్లిపోయాలానే ఉంది. ఐదో వారం నామినేషన్స్ ప్రక్రియ ఏ ఒక్కరినీ మనశ్శాంతిగా ఉండనిచ్చేలా లేదు. ఏ ఒక్క కంటెస్టెంట్ గురించి చెప్పినా తక్కువే అవుతంది. ప్రతీ ఒక్క తమ ప్రతాపాన్ని చూపారు. ప్రోమోలో అయితే ఒక్కొక్కరు ఇరగదీశారు. ఇక కొట్టుకుని చావడమే తరువాయి అన్నట్టు రెడీగా ఉన్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో దివి, సోహెల్, అఖిల్, అభిజిత్, అవినాష్, హారిక, అమ్మ రాజశేఖర్ ఇలా అందరూ రెచ్చిపోయారు.
మొదటి ప్రోమోలో అలా..
నేడు రిలీజ్ చేసిన మొదటి ప్రోమోలో కేవలం అభి అఖిల్ మద్య మాటల యుద్దాన్ని మాత్రమే చూపించాడు. నువ్ కన్ఫ్యూజ్ అవుతావ్ అని నాకు తెలుసు. కానీ పచ్చి అబద్దాలు మాట్లాడుతావని ఇప్పుడు తెలుసింది.. కళ్లు ఎగిరేసి.. అలా చూసి ఇలా చూసి మాట్లాడితే భయపడతారని అనుకోకు అని అభి గట్టిగా ఇచ్చాడు. వేలు అలా చూపించి మాట్లాడకు డూడ్ అంటూ అఖిల్ రెచ్చి పోయాడు. ఆ మాటకు అభి స్పందిస్తూ.. ప్రతీసారి నువ్ చేసేది అదే అంటూ మరో కౌంటర్ వేశాడు.
అభిజిత్ అఖిల్ ఇష్యూ..
మొదటి ప్రోమోలో అభి అన్న డైలాగ్ బాగా వైరల్ అయ్యాయి.నువ్ ఆ రోజు మోనాల్ మీద కూడా అలాగే వేలు పెట్టి చూపించావ్.. అని అఖిల్ అంటే.. ఆమె ఇష్యూ నీకెందుకు బ్రదర్.. అంటూ అభి కౌంటర్ వేశాడు. అమ్మాయి గురించి అలా మాట్లాడితే.. ఆమె క్యారెక్టర్ బయటకు ఎలా వెళ్తుందో అని అఖిల్ అంటే.. అది మేము ఇద్దరం చూసుకుంటాం నీకెందుకు అంటూ అభిజిత్ రెచ్చిపోయాడు.
రెండో ప్రోమోలో పీక్స్..
ఇక రెండో ప్రోమోలో ఇంటి సభ్యులందరి మాటలను, గొడవలను చూపెట్టాడు. ఇందులో సోహెల్‌కు దివి ఇచ్చిన పంచ్.. సోహెల్ అభిల సెటైర్లు, అవినాష్-హారిక-అమ్మ రాజశేఖర్ల కామెంట్స్ బాగా పేలాయి. దివి లాస్య మధ్య మాటల యుద్దం కూడా బాగానే వర్కవుట్ అయింది. ఇందులో అభి అఖిల్ మధ్య సవాల్ బాగా వైరల్ అవుతోంది.
దమ్ముంటే పీకు..
నీకు అంత దమ్ముంటే బయటకెళ్లి మాట్లాడుకో అని అఖిల్ అంటే.. దమ్ముంటే నన్ను ఇక్కడి నుంచి పీకు చూసుకుందాం..అని అభి కౌంటర్ వేశాడు. మోనాల్ నీకు స్టోర్ రూంలో ఏదో చెప్పింది.. పర్సన్‌గా నువ్ అంటే ఇష్టమని.. ఏదొకటి అని అఖిల్ మళ్లీ మోనాల్ విషయం ఎత్తాడు. ఆమె నన్ను లైక్ చేస్తుందనేది నీకు ఎక్కువ ప్రాబ్లం ఉన్నది ఆడ అంటూ అభి మరో పంచ్ ఇచ్చాడు. వేరే వాళ్ల టాపిక్ తీసుకురాకండి.. ఇది జాతీయ చానెల్ అందరూ చూస్తున్నారు అని మోనాల్ ఏడుపు ప్రారంభించింది.
Recommended Video
మీలో మీరు కొట్టుకోండి..
ఇక ఇందులో అమ్మ రాజశేఖర్ సేఫ్ గేమ్ ఆడను అని చెప్పడం సోహెల్ మాటలకు దివి కౌంటర్ వేయడం.. ఎక్కడ అవుతుంది.. ఏం అవుతుంది అని సోహెల్‌కు పంచ్ వేయడం ఫుల్ వైరల్ అవుతోంది. ఇంతలా హీటెక్కిన పరిస్థితిలో నోయల్ సాధుజంతువులా కూల్‌గా మాట్లాడటంతో అందరూ సెటైర్లు వేస్తున్నారు. మీలో మీరు కొట్టుకుని చావండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.