సోహెల్-అవినాష్ మధ్య మాటల యుద్దం.. ఆవేశంలో లాగి పెట్టి కొట్టేశాడు!!
బిగ్‌బాస్ షోలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం. స్నేహంగా ఉన్నవారే మరుక్షణంలో శత్రువులుగా మారుతూ ఉండొచ్చు. శత్రువులుగా ఉన్న వారు మిత్రులుగా మారొచ్చు. నేటి టాస్క్ చాలా మంది మధ్య విబేధాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. అమీ తుమీ అనే టాస్క్‌లో అఖిల్, అరియానా టీంలు పోటాపోటీగా పార్టిసిపేట్ చేస్తున్నాయి. బిగ్ బాస్ ఇచ్చిన డీల్స్‌ను సమర్థవంతంగా పూర్తి చేస్తున్నాయి. మొదటి రోజు దాదాపు ఆరు డీల్స్ చేసుకున్న టీమ్స్.. నేడు మరికొన్ని డీల్స్ చేసుకోబోతోన్నట్టు తెలుస్తోంది.

సంచాలక్‌గా సోహెల్..
అమీ తుమీ టాస్క్‌లో సంచాలక్‌గా సోహెల్ వ్యవహరిస్తున్నాడు. బ్లూ టీం కెప్టెన్‌గా అఖిల్ తన సభ్యుల కోసం గంట కొడుతూ డీల్స్‌ను సెట్ చేస్తున్నాడు. రెడ్ టీం కోసం కెప్టెన్ అయిన అరియానా గంట కొట్టేందుకు బాగా ప్రయత్నిస్తోంది. ఇక ఇరు వైపుల సభ్యులు త్యాగాలకు, టాస్కులకు ఏ మాత్రం వెనుకాడటం లేదు.

నేటి ఎపిసోడ్‌లో..
ఇక నేటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ అతి కష్టమైన డీల్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకోసం దివి బురదలోకి దిగినట్టు కనిపిస్తోంది. ఇక అఖిల్ కంటిన్యూగా షాంపుతో స్నానం చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈ టాస్కులోనే అఖిల్ తరుపున మోనాల్, సోహెల్, నోయల్ వచ్చినట్టు కనిపిస్తోంది.

సంచాలక్‌తో వాగ్వాదం..
అఖిల్ అంటే మాక్కూడా ప్రేమే అని, అతను నా స్నేహితుడు కూడా అంటూ మెహబూబ్ అంటున్నాడు. టాస్క్ కాబట్టి ఇలా చేస్తున్నామని మెహబూబ్ చెబుతున్నాడు. ఇక మోనాల్, నోయల్ ఇద్దరూ కూడా టాస్క్ మధ్యలోకి దూరినట్టు కనిపిస్తోంది. అయితే ఇందులో సంచాలక్‌గా సోహెల్ ఒకరికి సపోర్ట్ చేయడంపై అవినాష్ ఫైర్ అయ్యాడు.
Recommended Video

లాగి పెట్టి...
ఇది సేఫ్ గేమ్ అంటారు.. నన్ను అంటారు మళ్లీ.. అంటూ అవినాష్ సెటైర్ వేశాడు. ఇక అవినాష్ ఇలా అనడంతో సోహెల్ బాగా హర్ట్ అయినట్టు కనిపిస్తోంది. బాత్రూంలోకి వెళ్లి వీరావేశంలో టేబుల్‌ను గట్టిగా లాగిపెట్టి కొట్టేశాడు. ఏం చేయకపోయినా అందరూ తిడుతున్నారంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు.


Click it and Unblock the Notifications











