నేను లేకుండా ఎలా బతుకుతావ్?.. అరియానాతో ఓ రేంజ్ పులిహోర కలిపేస్తోన్న అవినాష్
బిగ్‌బాస్ షోలో ఫేమస్ అవ్వాలంటే స్కిన్ షో చేయాలి.. లేదా ఎవరితోనైనా రిలేషన్ షిప్ మెయింటైన్ చేయాలని కొందరు అనుకుంటారు. ఇంకొందరు మాత్రం బయట ఎలాగ ఉంటారో బిగ్ బాస్ ఇంట్లోనూ తమలాగే ఉంటారు. అక్కడి పరిస్థితుల మూలాన కొందరు కొన్ని కొన్ని స్ట్రాటజీలు ప్లే చేస్తుంటారు. ఇందులో భాగంగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్ ముందుగానే స్కెచ్ వేసుకున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇంట్లోకి వచ్చిన క్షణం నుంచి అమ్మాయిలందరికీ ఏదో రకంగా బిస్కెట్లు వేస్తూనే ఉన్నాడు.

మోనాల్‌తో మొదటగా...
ఇంట్లోకి వచ్చీ రావడంతోనే మోనాల్‌తో పులిహోర కలిపేశాడు. తనది పెద్ద ఫ్యామిలీ అని తనపై కూడా శ్రద్ద పెట్టు కన్సిడర్ చేయ్ అంటూ హింట్ ఇచ్చాడు. కానీ మోనాల్‌తో అవినాష్ ట్రిక్ పని చేయలేదు. ఇక దివి విషయంలోనూ మనోడు బాగానే ప్రయత్నించాడు కానీ కుదరలేదు. పైగా హైట్ కూడా సరిపోదనుకోంది.

సుజాతతోనూ అంతే..
అవినాష్ సుజాతతోనూ పరాచకాలు ఆడేవాడు. అంతే క్లోజ్‌గా మాట్లాడే వాడు. సుజ్జి అంటూ ప్రేమగా పిలుస్తూ ఏదో ఫీలింగ్ కలిగేలా చేసినట్టున్నాడు. కానీ అందరితోనూ అలాగే ఉండటంతో సుజాత హర్టైనట్టుంది. అందుకే వెళ్లిపోతూ ఘోరమైన మాట అనేసింది. ప్రేమను పంచుతాడు.. అందరితో అలాగే ఉంటాడు.. పెళ్లి ఎలా అయితదో చూస్తా.. కాకుండా చూస్తా అంటూ అవినాష్‌ను టార్గెట్ చేసింది.

అరియానా కనెక్ట్ అయింది..
అయితే అవినాష్ చేసే ప్రయత్నానికి నాగార్జున కొంత ఉప్పు అందించడంతో అరియానాతో ట్రాక్ బాగానే కనెక్ట్ అయింది. సోఫా మీద ఏదో రాశాడంటూ పెద్దగా సీన్ క్రియేట్ చేశాడు నాగ్. తీరా అక్కడ కూల్ అని రాశావ్ అంటూ అందర్నీ కూల్ చేసేశాడు. అక్కడి నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఉందని అందరూ అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టు వారు కూడా బాగానే సన్నిహితంగానే ఉంటున్నారు.

నిన్నటి మేకప్ వేస్తూ..
మామూలుగా అరియానా కావాలని చేస్తుందో ఏమో తెలియదు గానీ ఒక్కోసారి ఏం చేస్తుందో ఆమెకే తెలియదు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో ఆమె మేకప్ వేసుకుంటూ ఉంటే అవినాష్ హెల్ప్ చేశాడు. నేను లేకపోతే ఎలా బతుకుతావ్ అని అవినాష్ అంటే.. ఏదో అలా బతుకు జట్కా బండిని ఈడుస్తా అంటూ అరియానా చెప్పింది. ఇలా వీరిద్దరి మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. చివరి వరకు వీరి బంధం ఇలానే ఉంటుందా? అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











