బిగ్‌బాస్ షోలో ఆ పని చేస్తే మంచిగుండదని ఇంట్లోవాళ్లు వార్నింగ్ ఇచ్చారట.. కానీ హారిక అదే చేసింది!!

బిగ్‌బాస్ షోలో ప్రతీ సీజన్‌లో టాస్కులు కామన్ గానే ఉంటాయి. కానీ మనుషులే మారుతుంటారు. ఇలా ఈ నాల్గో సీజన్‌లో త్యాగాల పర్వం ఎపిసోడ్ రానే వచ్చింది. నేటి ఎపిసోడ్‌లో అందరూ త్యాగాలు చేస్తూ త్యాగమూర్తులయ్యేలానే కనిపిస్తున్నారు. తాజాగా వచ్చిన ప్రోమో ప్రకారం కుమార్ సాయి చొక్కాలు కత్తిరించుకున్నట్టు తెలుస్తోంది. ఇక హారిక తనకెంతో ఇష్టమైన జుట్టును కత్తిరించుకునేందుకు సిద్దమైంది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. త్యాగం చేసేందుకు సిద్దమవ్వడంతో హారికకు ముద్దు పెట్టేశాడు అఖిల్. ఇక్కడే వ్యవహారం ఏదో మలుపు తిరిగినట్టు కనిపిస్తోంది.

మొదటి నుంచి దూరమే..

మొదటి నుంచి దూరమే..

అభిజిత్ అందరితో కలుస్తాడు. అందరితో మాట్లాడతాడు. కానీ అఖిల్ మాత్రం అంత ఈజీగా కలవలేదు. ఇక ఒక్క మోనాల్ చుట్టూ తిరగడానికే అఖిల్‌కు సమయం సరిపోవడం లేదు. అభిజిత్ హారిక కాంబోకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడు ఎలాంటి ఘటన ఎదురైనా అభికి మద్దతుగా హారిక నిలుస్తూ వాదించేది.

ఇద్దరికీ గొడవలు..

ఇద్దరికీ గొడవలు..

మామూలుగానే హారిక, అఖిల్‌కు అంతగా పడదు. ఈ ఇద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉంటారు. ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నట్టు ఎప్పుడూ కూడా చూపించలేదు. అంత చనువు వీరి మధ్య ఉందని కూడా ప్రేక్షకులు అనుకోవడం లేదు. అలాంటిది అఖిల్ కోసమే హారిక జుట్టును కత్తిరించుకునేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది.

వచ్చే ముందే చెప్పాడట..

వచ్చే ముందే చెప్పాడట..

బిగ్‌బాస్ షోకు వచ్చే ముందు తన అన్నయ్య హారికకు ఓ వార్నింగ్ ఇచ్చాడట. జుట్టు కత్తిరించుకుంటే మాత్రం బాగుండదని హెచ్చరించాడట. అయినా సరే అన్న మాటలను లెక్కచేయకుండా అఖిల్ కోసం జుట్టు కత్తిరించుకునేందు రెడీ అయింది.

ముద్దు పెట్టిన అఖిల్..

ముద్దు పెట్టిన అఖిల్..

ఇక తన కోసం జుట్టు కత్తిరించుకునేందుక హారిక రెడీ అవ్వడంతో అఖిల్ గాల్లో తేలిపోయాడు. తన కోసం ఏమీ వద్దని, నీకు ఇష్టమైతేనే చెయ్ అంటూ ఘాడంగా హత్తుకుని ఓ ముద్దు పెట్టేశాడు. ఇక అన్నకు ఇచ్చిన మాటను నెరవేర్చలేకపోతోన్నాని సారి చెబుతూ హారిక కంటతడి పెట్టేసింది.

Recommended Video

Birthday Wishes For The Bollywood Legend From Tollywood Stars
గతంలోనూ అంతే..

గతంలోనూ అంతే..

గత సీజన్లలోనూ ఇలాంటి ఓ టాస్క్ పెట్టాడు. రెండో సీజన్‌లో దీప్తి సునయన, మూడో సీజన్లో శివజ్యోతి జుట్టు కత్తిరించుకున్నారు. ఈ సారి హారిక వంతు వచ్చింది. జుట్టును కత్తిరించుకుని ఎరుపు రంగును వేసుకునేందుకు రెడీ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X