అమ్మో హారిక చిన్నదేమీ కాదు.. భారీ ప్లాన్‌తోనే వచ్చింది.. మొత్తానికి స్ట్రాటజీ బయటపడింది!
బిగ్ బాస్ షోలో నెగ్గడం అంతా ఈజీ కాదు. ఎన్ని స్ట్రాటజీలు ప్లే చేసినా ఒక్కోసారి ఏదీ కూడా వర్కవుట్ కాకపోవచ్చు. ఎందుకంటే అక్కడ క్షణక్షణానికి ప్లాన్లు మారుతుంటాయ్. అందుకే షో ఎలా గెలుస్తామని కాకుండా ఎదురైన పరిస్థితులను ఎలా అధిగమించాలో తెలివిగా ఆలోచించాలి. ఆడాలి. అప్పుడే జనాల మనసులను గెలుచుకుంటారు. అలా కాకుండా ట్రాకులు నడిపించి, స్కిన్ షో చేసి, పులిహోరలు కలిపేస్తేనే విజేతలు కాలేరు. అయితే సెక్సీగా కనిపించాలి, గ్లామర్ షో చేయాలనే ఉద్దేశ్యంతోనే హారిక ఇంట్లోకి వచ్చినట్టు నిన్నటి ఎపిసోడ్ ద్వారా క్లియర్‌గా తెలిసింది.

ఎంట్రీ సాంగ్‌తోనే..
బిగ్‌బాస్ షోలోకి హారిక అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు ఆమె వీడియోలు చూసిన వారు కూడా.. అలాంటి డ్రెస్‌లో, అంతటి హాట్ పర్ఫామెన్స్‌తో వస్తుందని ఊహించరు. ఆమె వేసుకున్న పొట్టి డ్రెస్ ఆ స్కిన్ షో బాగానే వైరల్ అయింది. ఆమె నడవడానికి కూడా కాస్త ఇబ్బంది పడింది కూడా. దాన్ని బట్టే ఆమె ఇంట్లో ఎలా ఉండబోతోన్నా అనేది స్పష్టం చేసింది. అందుకే అలా ఓ శాంపిల్ వదిలింది.

పొట్టి బట్టలతో రచ్చ..
హారిక ఇంట్లో దాదాపుగా పొట్టి పొట్టి బట్టలనే వేసుకుంటుంది. ఇక మార్నింగ్ సాంగ్‌లో అయితే వేరే లెవెల్‌లో స్కిన్ షో చేస్తుంది. పాటకు తగ్గట్టు వయ్యారాలను ఊపుతూ.. నడుమును బాగానే చూపిస్తుంది. ఆ కెమెరాలు కూడా హారిక నాభిపై బాగానే శ్రద్ద పెట్టినట్టు కనిపిస్తుంది.

నిన్నటి టాస్క్‌లో..
ఇక బిగ్ బాస్ నిన్న ఇచ్చిన అమీ తుమీ టాస్క్‌లో హారిక బాగానే చేసింది. టాస్క్‌లో భాగంగా అఖిల్ టీంలో హారిక వచ్చి చేరింది. ఇక బిగ్ బాస్ ఇచ్చిన డీల్ ప్రకారం జుట్టు కత్తిరించుకునేందుకు హారిక సిద్దమైంది. అయితే ఇక్కడ ఆమె చేసిన కామెంట్ మాత్రం ఆమెలోని ఉద్దేశ్యాన్ని బయట పెట్టింది.

జుట్టు కత్తిరించుకుంది..
జుట్టు కత్తిరించుకోవడం లాంటి పనులు చేయకంటూ ఇంట్లో వాళ్లు ముందే హెచ్చరించారట. కానీ హారిక మాత్రం తన అన్న చెప్పిన మాటలను వినకుండా జుట్టు కత్తిరించుకుంది. వాటికి ఎరుపు రంగు కూడా వేసుకుంది. అంతా బాగానే ఉంది. ఆ సమయంలోనే అక్కడ హారిక ఓ డైలాగ్ విసిరింది.
Recommended Video

సెక్సీగా కనిపించను..
జుట్టు కత్తిరించుకుంటున్న సమయంలో అందరూ గోవిందా గోవిందా అని నామస్మరణ చేశారు. అయితే మాటల్లో మాటగా ఇక నుంచి నేను సెక్సీగా కనిపించనేమో, డ్యాన్సులు చేసేటప్పుడు ఎలా మరి అంటూ ఓ మాట అనేసింది. అంటే ఆమె ఇంట్లో సెక్సీగా కనిపించి ఓట్లు కొట్టేద్దామనే స్ట్రాటజీతోనే వచ్చిందని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











