లాస్యది మోస పూరితమైన నవ్వు.. అరియానాది అతి.. ఒక్కొక్కరి మనసులో ఇంత ఉందా?

బిగ్‌బాస్ షోలో ఆరో వారం నాగార్జున సందడి చేశాడు. వారంలో చేసిన తప్పులను ఎత్తి చూపుతూ ఒక్కొక్కరికీ క్లాసులు ఇచ్చాడు. ఇక బిగ్ బాస్ ఇచ్చిన డీల్‌ను మిస్ చేయడం, మోనాల్‌కు ఇచ్చిన టాస్క్‌ అరియానా తీసుకోవడం వరకు బాగానే ఉంది. అమ్మ రాజశేఖర్ అరగుండు కొట్టించుకుని వచ్చ వారం నామినేషన్ నుంచి సేవ్ అయ్యాడు. అయితే కంటెస్టెంట్లందరూ మిగతా వారి గురించి వారి మనసులో ఏం అనుకుంటున్నారో బయట పెట్టించే ఆట ఆడించాడు. అసలు శనివారం నాటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందోఓ సారి చూద్దాం.

అవినాష్‌కు క్లాసు పీకేశాడు..

అవినాష్‌కు క్లాసు పీకేశాడు..

సంచాలక్‌గా సోహెల్ తప్పు చేశాడంటూ అవినాష్ గొడవ పెట్టుకుని అరిచిన సంగతిని నాగార్జున ప్రస్థావించాడు. దివి టబ్ నుంచి దిగిన తరువాత వెంటనే మళ్లీ హెచ్చరించాడని, అఖిల్‌కు టవల్‌తో తుడిచేందుకు నువ్వే మొదట ఓకే అన్నావని అవినాష్‌కు నాగార్జున క్లాస్ పీకాడు. సంచాలక్‌గా సోహెల్ కరెక్ట్ చేశాడని కితాబిచ్చాడు. పైగా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడని ప్రశంసించాడు. అయితే వాదనలు కూడా వినిపించాలని సోహెల్‌కు సూచించాడు.

అమ్మ రాజశేఖర్ ధైర్యం..

అమ్మ రాజశేఖర్ ధైర్యం..

బిగ్‌బాస్ ఇచ్చిన డీల్‌ను మిస్ చేయడంతో నాగార్జున మళ్లీ దాన్ని ప్రస్థావించాడు. ఈ సారి అరగుండు డీల్‌ను పూర్తి చేసినవారికి వచ్చే వారం నామినేషన్ నుంచి సేవ్ అయ్యే చాన్స్ ఇస్తానని తెలిపాడు. లేదంటే ఎవరో ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇస్తానని చెప్పాడు. దీంతో అమ్మ రాజశేఖర్ అరగుండు, అరమీసం కొట్టించుకున్నాడు. అమ్మ రాజశేఖర్ అలా చేయడంతో దివి భోరున ఏడ్చింది.

సుత్తి లేకుండా సూటిగా

సుత్తి లేకుండా సూటిగా

ప్రతీ వారం కంటెస్టెంట్లందరికీ బిగ్ బాస్ ఓ టాస్క్ ఇస్తాడట. ప్రతీ కంటెస్టెంట్ మిగతా కంటెస్టెంట్ల గురించి ఏమనుకుంటున్నారో రాసి ఇవ్వాల్సింది ఉంటుందట. అందులో భాగంగానే వారు రాసిన స్టేట్మెంట్లను చదివి వినిపించారు. సుత్తి లేకుండా సూటిగా మనసులోని మాట అని ఆట ఆడించాడు. అది ఎవరు రాసి ఉంటారో కరెక్ట్‌గా గెస్ చేయాలని ఓ టాస్క్ పెట్టాడు. ఈ క్రమంలో అవినాష్‌ది టాస్క్‌లో క్రూరమైన మసస్తత్వం అని దివి పేర్కొంది. అలా దివి రాసిందని అవినాష్ కనిపెట్టేశాడు.

మోస పూరితమైన నవ్వు..

మోస పూరితమైన నవ్వు..


స్వార్ధపరుడు, స్నేహాన్ని వాడుకుంటాడని మోహబూబ్ గురించి కుమార్ సాయి రాశాడు. లాస్యది మోసపూరిత నవ్వు అని అమ్మ రాజశేఖర్ చెప్పుకొచ్చాడు. కానీ లాస్య మాత్రం దివి అయి ఉంటుందని పొరబాటు పడింది. అభికి చాలా అహంకారం రాశారు. కానీ అది ఎవరు రాసి ఉంటారో కనిపెట్టడంలో అభి ఫెయిల్ అయ్యాడు. అఖిల్, మోనాల్ రాసి ఉంటారని తప్పుగా అర్థం చేసుకున్నాడు. కానీ అభిని ఆ మాటలు అన్నది దివి అని తరువాత తెలుసుకున్నాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : ఒక కామెడీ పీస్ అరిస్తే ఏడుస్తావా ? నాగార్జున స్ట్రాంగ్ కౌంటర్,ఏడ్చేసిన సోహైల్
ముగ్గురు సేవ్..

ముగ్గురు సేవ్..


దివికి సభ్యత లేదని మోనాల్, నిజాయితీ ముసుగులో ఉంటాడని అఖిల్ గురించి అభిజత్ అభిప్రాయపడ్డాడు. మోనాల్ అబద్దాల కోరు అని అభిజిత్ పేర్కొన్నాడు.అందర్నీ ఏమారుస్తాడు అని అమ్మ రాజశేఖర్ గురించి అభిజిత్ చెప్పుకొచ్చాడు. నేటి ఎపిసోడ్‌లో లాస్య, హారిక, నోయల్ ముగ్గురు సేవ్ అయ్యారు. అయితే బయట వినిపిస్తున్నా టాక్ ప్రకారం కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తోంది. మరి అసలు సంగతి తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X