మెహబూబ్ లక్ బాగుంది.. లేదంటే నిజంగానే పుచ్చ లేచిపోయేదే!!

బిగ్‌బాస్ షోలో ఇప్పుడిప్పుడే పోటీ గట్టిగా మారుతోంది. ఒక్కొక్కరి నిజ స్వరూపాలు బయటకు వస్తున్నాయి. ఎవరెవరు ఎలాంటి వారో కంటెస్టెంట్లు కూడా ఓ అంచనాకు వచ్చారు. ఇక ఐదు వారాలు విజయవంతంగా గడిచిపోయాయి. ఈ ఐదువారాల్లో ఐదుగురు (సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, దేవీ నాగవల్లి, స్వాతి దీక్షిత్, సుజాత) ఎలిమినేట్ అయ్యారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో గంగవ్వ ఐదో వారంలో బయటకు వెళ్లిపోయింది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో నామినేషన్ల పర్వం మళ్లీ వేడెక్కింది. మాటల యుద్దం మళ్లీ మొదటకి వచ్చింది.

ఆరో వారం నామినేషన్ ప్రక్రియ..

ఆరో వారం నామినేషన్ ప్రక్రియ..

ఎర్ర మిరపకాయల దండతో ఆరో వారం నామినేషన్ ప్రక్రియను ముందుకు సాగేలా బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ప్రతీ ఇంటి సభ్యుడి ఓ ఇద్దరిని నామినేట్ చేయాలని, అందుకు తగ్గ కారణాలను వెల్లడించాలని ఆపై ఎర్ర మిరపకాయల దండ వేయాలని తెలిపాడు. అయితే ఈ మిర్చి పెట్టిన మంట బాగానే వర్కవుట్ అయింది.

 వాగ్వాదాలతో రచ్చ..

వాగ్వాదాలతో రచ్చ..

ఆరోవారం నామినేషన్ ప్రక్రియలో అరియానా, సోహెల్, దివి, మెహబూబ్, కుమార్ సాయిల వాగ్వాదం రచ్చగా మారింది. అంతకు ముందు జరిగిన కొన్ని సంఘటనల ప్రభావం నామినేషన్ల మీద పడ్డింది. బౌల్స్ విషయంలో సోహెల్ లెవనెత్తిన అంశంతో అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి, అరియానాలు రివర్స్ అయ్యారు. ఈ అందరి మధ్య మాటల యుద్దం పెరిగింది. చివరకు అరియానా పొగరు అంటూ సోహెల్‌ను కాస్త ఘాటుగా సంభోదించింది. ఇదే విషయం నామినేషన్‌లో రచ్చగా మారింది.

 సోహెల్, కుమార్ సాయి..

సోహెల్, కుమార్ సాయి..

సోహెల్-కుమార్ సాయి మధ్య గట్టిగానే వాగ్వాదం జరిగింది. వేలెత్తి చూపాడని కుమార్ సాయిపై సోహెల్ ఫైర్ అయ్యాడు. వేలు అలా చూపెట్టకు దించు అంటూ సోహెల్ హెచ్చరించాడు. ఇలా వీరి వాగ్వాదం నామినేషన్ వరకు వెళ్లింది. అలా వీరి నామినేషన్‌లు జరిగాయి. అయితే అందరిలోనూ చాలా మంది మెహబూబ్‌ను నామినేట్ చేశారు. పుచ్చలేచిపోద్ది అనే డైలాగ్‌ను సాకుగా పెట్టి మెహబూబ్‌ను నామినేట్ చేశారు.

ఎప్పుడు దొరుకుతాడా..

ఎప్పుడు దొరుకుతాడా..

మామూలుగా మెహబూబ్ మూడో వారంలోనే వెళ్లిపోయే వాడు. మామూలుగా అయితే ఎలిమినేట్ అయిపోయాడని లీకులు కూడా వచ్చాయి. కానీ చివరి క్షణంలో దేవీ నాగవల్లి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆడియన్స్ మెహబూబ్ కోసం ఎదురుచూశారు. ఎప్పుడు నామినేషన్‌లోకి వచ్చినా ఇంటికి పంపేద్దామని చూశారు. అలా నాల్గో వారంలోనూ నామినేషన్‌లొకి వచ్చారు. అయితే స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయింది. కానీ సోషల్ మీడియా ట్రెండ్ ప్రకారం మెహబూబ్ డేంజర్ జోన్‌లో ఉన్నాడు.

Recommended Video

Birthday Wishes For The Bollywood Legend From Tollywood Stars
అలా బతికిపోయాడు..

అలా బతికిపోయాడు..

మామూలుగా అయితే ఐదో వారం ఎలిమినేట్ అయిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ నామినేషన్‌లొకి రాకుండా బతికిపోయాడు. ఇక ఈ ఆరోవారంలో కచ్చితంగా మెహబూబ్ ఇంటికే అని అందరూ అనుకున్నారు. కానీ సోహెల్ తన కెప్టెన్సీ పవర్‌తో మెహబూబ్‌ను సేవ్ చేశాడు. లేదంటే ఈ సారి మెహబూబ్ పుచ్చపగిలిపోయేది.. ఎలిమినేట్ అయి బయటకు వచ్చేవాడు. మరి నామినేట్ అయిన అరియానా, అభి, మోనాల్, కుమార్, దివి, అఖిల్, నోయల్, లాస్య, హారికల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X