Bigg Boss Unseen.. మంచిగా మాట్లాడితే పొగరా.. సోహెల్‌పై కుమార్ సాయి ఫైర్
బిగ్‌బాస్ షోలో చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరుగుతాయి. చూసే జనాలకు అవి సిల్లీగా అనిపించినా లోపల ఉన్న కంటెస్టెంట్లకు అవి ముఖ్యమైనవిగానే కనిపిస్తాయి. నిన్నటి ఎపిసోడ్‌లో గిన్నెలు కడిగే విషయంలో మొదలైన గొడవ నామినేషన్‌లో పెద్ద వాగ్వాదానికి దారి తీసింది. అమ్మ రాజశేఖర్ సోహెల్ మధ్య మొదలైన ఈ రచ్చలో కుమార్ సాయి, అరియానా వచ్చి పడ్డారు. ఇందులో మరీ విచిత్రం ఏంటంటే ఆ అందరూ సోహెల్ మంచి కోసమే చెప్పారు. కానీ అది రివర్స్ అయింది.

అమ్మ రాజశేఖర్‌తో గొడవ..
బిగ్ బాస్ ఇంట్లో ఎవరి ప్లేట్స్ వారికే ఉన్నాయి. ఎవరి ప్లేట్ కింద వారు తమ తమ పేర్లను రాసుకున్నారు. అయినా సరే కొన్నిసార్లు వేరే దాంట్లో తింటుంటారు. అయితే అది ఫ్రెండ్షిప్‌లో జరిగిపోతుందని, కానీ ఎవ్వరూ కడగటం లేదని సోహెల్ మండి పడ్డాడు. కప్పులు ఎవ్వరూ కడగటడం లేదని సోహెల్ వాదిస్తుంటే.. బ్యాడ్ అవుతావ్ వదిలేయ్ అని మాస్టర్ చెప్పినా సోహెల్ వినలేదు. వారిద్దరి మధ్య గొడవ జరిగింది.

సర్దిచెప్పేందుకు..
సోహెల్ చెప్పినదాంట్లో, మాస్టర్ చెప్పిన దాంట్లో పాయింట్ ఉందని మెహబూబ్ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఇదే విషయంలో సోహెల్‌తో మాట్లాడేందుకు మెహబూబ్, అరియానాలు వచ్చారు. ఇందులో మెహబూబ్ చెప్పేసరికి ఓ క్లారిటీ రావడంతో.. నువ్ చెప్పాల్సిన పని లేదన్నట్టు అరియానా వెళ్లిపో అనేశాడు. అలా అనడంతో అరియానా హర్ట్ అయింది.

కుమార్ సాయి ఎంట్రీ..
ఇక ఇదే విషయంపై ఇంటి సభ్యులందరూ డైనింగ్ టేబుల్ వద్ద చర్చించుకున్నారు. మాటల్లో మాటగా కుమార్ సాయి గత కెప్టెన్‌గా అనుభవాలు చెప్పాడు. అందరి మీద అజమాయిషీ చెలాయించడం కాదు, వ్యక్తిగతంగా ఎవ్వరినీ అనొద్దంటూ వేలు చూపెట్టి మాట్లాడాదు. అలా వేలు చూపెట్టడంతో సోహెల్ రెచ్చిపోయాడు. వేలు దించు అంటూ బెదిరించాడు. ఎంత పాయింట్ మీటర్ దించాను సరిపోతుందా? అని కుమార్ సాయి రివర్స్ కౌంటర్ వేశాడు. ఇదే విషయంలో నామినేట్ చేసుకుని మళ్ల వాగ్వాదానికి దిగారు.
Recommended Video

మళ్లీ అదే విషయంలో..
బిగ్ బాస్ అన్ సీన్‌లోనూ వీరి గొడవనే చూపించారు. నాగార్జునకు మాటిచ్చానని అరవలేదట.. లేదంటే డైనింగ్ టేబుల్ వద్ద వేలు చూపించినప్పుడు కథ వేరేలా ఉండేదంటూ అఖిల్‌తో చెప్పుకొచ్చాడు. మళ్లీ మెహబూబ్, సోహెల్ కలిసి కుమార్ సాయితో వేలు చూపెట్టే విషయంపైనే చర్చించారు. మంచిగా మాట్లాడితే పొగరా అంటూ కుమార్ సాయి మళ్లీ వేలెత్తి చూపించి మాట్లాడాడు. సోహెల్ దించమని అడుగుతున్నా దించలేదు. కావాలని చేస్తున్నాడు వదిలేయ్ అంటూ సోహెల్‌కు మెహబూబ్ నచ్చజెప్పాడు.


Click it and Unblock the Notifications











