అభిజిత్‌తో దురుసుగా అమ్మా రాజశేఖర్.. దివి రంగంలోకి దిగడంతో.. ఏం ఫిట్టింగ్ పెట్టావ్ బిగ్‌బాస్

బిగ్‌బాస్ షోలో ఏడో వారం కంటెస్టెంట్లందరూ కలిసి ఓ సినిమా తీశారు. ఈ మేరకు బిగ్ బాస్ బ్లాక్ బస్టరే అనే టాస్క్‌లో అభిజిత్ దర్శకుడిగా, దివి సహాయ దర్శకురాలిగా, నోయల్ కెమెరామెన్‌గా, అవినాష్ స్క్రిప్ట్ రైటర్‌గా వ్యవహరించారు. కొరియోగ్రాఫర్‌గా అమ్మ రాజశేఖర్‌ను ఫిక్స్ చేసి.. హారిక, సోహెల్‌లకు స్పెషల్ ఐటం సాంగ్‌ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఇక ఈ క్రమంలో దర్శకుడు, రైటర్, డీఓపీ, అసిస్టెంట్ డైరెక్టర్ కలిసి స్టోరీ డిస్కషన్ పెట్టేశారు. మొత్తానికి నాల్గో సీజన్‌లో కంటెస్టెంట్లందరూ సినిమాను ప్రారంభించి.. ముగించేశారు.

అభితో గొడవ..

అభితో గొడవ..

కొరియోగ్రాఫర్‌గా ఉన్న అమ్మ రాజశేఖర్‌కు డైరెక్టర్ అభిజిత్‌కు మధ్య గొడవలు వచ్చాయి. ఐటెం సాంగ్ లొకేషన్ బిగ్ బాస్ కేటాయిస్తాడని అభిజిత్ చెప్పినా అమ్మ రాజశేఖర్ వినిపించుకోలేదు. అది కొరియోగ్రాఫర్ ఇష్టమని దర్శకుడి మాటను లెక్క చేయలేదు. డైరెక్టర్ కూడా కెమెరాలోకి రాకూడదని అమ్మ రాజశేఖర్ అభిజిత్‌కు చెప్పాడు. అలా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆడు అంటూ అభిజిత్‌తో దురుసుగా ప్రవర్తించాడు. చివరకు దివి వెళ్లి అమ్మ రాజశేఖర్‌ను శాంతపర్చింది.

అవినాష్‌తో గొడవ..

అవినాష్‌తో గొడవ..

స్క్రిప్ట్ రైటర్ అయిన అవినాస్ తన సీన్లు మాత్రం బాగా రాసుకున్నాడంటూ హీరో అయిన అఖిల్‌కు మాత్రం సరైన డైలాగ్స్ రాయడం లేదంటూ అభిజిత్ మండిపడ్డాడు. ఈ విషయంలో అవినాష్ బాగానే హర్ట్ అయినట్టున్నాడు. అందరికీ సమానంగానే రాశానని కానీ తాను మాత్రం ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. అవినాష్ ఫీలై ఈ గొడవంతా సోహెల్‌తో చెప్పుకొచ్చాడు.

లాస్య అలా..

లాస్య అలా..

అవినాష్ అరియానాల మీదే ఫోకస్ ఎక్కువగా ఉందని, తనను మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోయింది. తాను ఎంత పర్ఫామ్ చేసినా డైరెక్టర్ గుర్తించడం లేదని అమ్మ రాజశేఖర్, మోనాల్‌తో చెప్పుకొచ్చింది తనను హీరోయిన్ అంటున్నారు కానీ అసలు అలా అనిపించడం లేదని తన బాధనుచెప్పుకొచ్చింది. హారిక, సోహెల్‌లు ఐటెం సాంగ్‌లో రెచ్చిపోయారు.

అఖిల్ మోనాల్ రొమాన్స్..

అఖిల్ మోనాల్ రొమాన్స్..

ప్రేమ మొదలైంది అనే సినిమాలో అఖిల్ మోనాల్ మధ్య రొమాన్స్ సీన్‌ను తెరకెక్కించారు. అందులో అఖిల్ చేసిన పనులు చూసి ఏం ఫిట్టింగ్ పెట్టావ్ బిగ్ బాస్.. అంటూ అభిజిత్ సెటైర్ వేశాడు. ఇలాంటి సీన్స్‌కు నేను డైరెక్టరా? అంటూ తన బాధను పరోక్షంగా వ్యక్త పరిచాడు.

Recommended Video

Bigg Boss Telugu 4: Amma Rajashekar Daring Step
 అవినాష్ సీరియస్...

అవినాష్ సీరియస్...

షూటింగ్‌లో సీరియస్‌గా ఉండకపోతే తనకు నచ్చదని, దివి ప్రతీ సారి డిస్టర్బ్ చేస్తోంది జోకులు వేస్తోందని ఫైర్ అయ్యాడు. అవసరం లేకపోయినా లాస్య టచ్ అప్ అంటూ మధ్యలోకి దూరుతోందని అవినాష్ లాస్ట్ సీన్‌లో చిరాకు పడ్డాడు. మొత్తానికి అవినాష్ కూల్ అవ్వడంతో సినిమాను పూర్తి చేసేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X