ఆ డైలాగ్‌తో గొడవ.. అరుపులతో అరియానా.. ఫన్నీగా కానిచ్చేసిన హారిక!!
బిగ్‌బాస్ హౌస్ కాస్త బిగ్ బాస్ పురంగా మారింది. ఏడో వారంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఓ టాస్క్ ఇచ్చాడు. కంటెస్టెంట్లను కొంటె రాక్షసులు, మంచి మనుషులు అనే టాస్కును ఇచ్చాడు. అసలు ఈ టాస్క్‌లో ఓ మెలిక ఉంది. అసలు రాక్షసులు అంటే ఏమిటి? అందులో కొంటె రాక్షసులు ఎలా ఉంటారు? మంచి మనుషులు ఎలా ఉండాలి? ఇలా క్లియర్‌గా బిగ్ బాస్ ఇచ్చాడు. మనుషులు తమను తాము కాపాడుకోకుండా రాక్షసుల చేష్టలను భరించాలని చెప్పాడు. మళ్లీ టాస్క్ ఇస్తానని, అందులో గెలిస్తే ఓ రాక్షసుడిని మనిషిగా మార్చొచ్చని తెలిపాడు. ఇలా ఈ టాస్క్ వల్ల ఇళ్లంతా గందరగోళంగా మారింది.

దుమ్ములేపారు..
అరియానా, అవినాష్, మెహబూబ్ కొంటె రాక్షసుల్లా కాదు.. కొరివి దెయ్యాల్లా ప్రవర్తించారు. అరియానా అయితే రాక్షసి టీం అనగానే ఎగిరి గంతులేసింది. అనుకున్నట్టే రాక్షసిగా తన మేకప్‌తో అందర్నీ భయపెట్టేసింది. అసలు ఆమె అరియానానే లేదా తేడానే అనే అనుమానం వ్యక్తమైంది. అలా మేకప్‌తోనే భయపెట్టిన అరియానా తన చేష్టలతో కూడా కొంటె రాక్షసి అని నిరూపించింది.

అవినాష్ అలా..
ఇక ఈ టాస్క్‌లో అవినాష్ మాత్రం తన మిమిక్రీతో జీవించేశాడు. డైలాగ్‌ల మీద డైలాగ్‌లు చెప్పి అందర్నీ ఎంటర్టైన్ చేశాడు. కొంటె రాక్షసుడిగా ఇళ్లంతా చిందరవందర చేస్తూనే హద్దుల్లో ఉండి మనుషులను హింసించాడు. మొహానికి నల్ల రంగు, ఎరుపు రంగు పూయడం డైలాగ్‌లతో బెదరగొట్టడం వంటివి చేస్తూ అలరించాడు.

హారిక ఫన్నీగా..
అయితే హారిక మాత్రం కొంటె రాక్షసిగా కాకుండా ఫన్నీ రాక్షసిలా మారింది. ఇంటి ఏమీ చేయకుండా మనుషులను విసిగించింది. అది కూడా సరదా సరదాగా ఏడిపించింది. అమ్మ రాజశేఖర్, నోయల్, సోహెల్, లాస్య ఇలా అందర్నీ బాగా అడ్డుకుంది. కానీ అరియానాలో కిచెన్‌ను నాశనం చేయడం, స్విమ్మింగ్ పూల్‌లో బట్టలు వేయడం, నోయల్ మీద గుడ్డుతో కొట్టడం వంటి పనులు చేయలేదు. హారిక తన పద్దతిలో తాను ఆడుకుంది.
Recommended Video

ఇక అలా గొడవ..
స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న పూలతో దండలు అల్లాల్సి ఉంటుందని మనుషుల టీంకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ఇక స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న మనుషుల టీంను అడ్డుకునేందుకు అరియానా, అవినాష్, మెహబూబ్ ప్రయత్నించగా.. దండలు అల్లుతున్న వారిని అడ్డుకునేందుకు హారిక, అఖిల్ ప్రయత్నించారు. బయట ఉండి ఏం చేస్తున్నారంటూ అరిచిన అరియానా.. తరువాత స్వరం మార్చి.. బయట ఉండి మీరు ఏం చేస్తున్నారు అని క్యాజువల్‌గా అడిగానని కవర్ చేసేసింది. అలా అరియానా, హారిక మధ్య గొడవైంది.


Click it and Unblock the Notifications











