Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కసితో పగతో రగిలిపోతోన్న అవినాష్.. వదలకుండా గట్టిగా హత్తుకున్న మోనాల్
బిగ్ బాస్ షో విజయవంతంగా ఆరు వారాలను పూర్తి చేసుకుంది. ఆరు ఎలిమినేషన్లు, గంగవ్వను బయటకు పంపించడంతో ఇంట్లో పన్నెండు మంది ఉండిపోయారు. అందులో అరగుండు కొట్టించుకుని అమ్మ రాజశేఖర్ ఒక్క వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. బిగ్ బాస్ ఇచ్చిన డీల్‌లో భాగంగా నోయల్ ముందే నామినేషన్లో వచ్చాడు.
ఇక మిగిలిన పది మందిని ఐదు జంటలుగా విడగొట్టి నామినేషన్ ప్రక్రియ చేపట్టాడు. కొందరు త్యాగాలు చేశారు.. కొందరు తమంతట తామే వెనక్కి తగ్గారు. మొత్తంగా ఏడోవారంలో ఇంటి నుంచి బయటక వెళ్లేందుకు ఆరుగురు నామినేట్ అయ్యారు. ఇక నేటి నుంచి టాస్క్ ఇచ్చి ఇంటి సభ్యులను ఆడించేందుకు బిగ్ బాస్ సిద్దమయ్యాడు.
నామినేషన్ ప్రక్రియ అలా..
అఖిల్-మోనాల్, అవినాష్-సోహెల్, అభిజిత్-హారిక, లాస్య-దివి, అరియానా-మెహబూబ్ అంటూ ఇలా ఐదు జంటలుగా బిగ్ బాస్ విడడగొట్టేశాడు. అందులో ఒకరు సేవ్ అవ్వాలి.. ఇంకొకరు సేవ్ అవ్వాలి అని తెలిపాడు. కొందరు సుధీర్థంగా చర్చలు పెట్టారు. ఇంకొందరు వెంటనే కాంప్రమైజ్ అయిపోయారు. అలా మోనాల్, అవినాష్, అభిజిత్, దివి, అరియానాలు నామినేట్ అయ్యారు.
దెయ్యాలు వర్సెస్ మనుషులు..
కొంటె రాక్షసులు మంచి మనుషులు అనే ఈ టాస్క్‌లో కంటెస్టెంట్లను రెండు టీంలుగా విడగొట్టాడు. ఇందులో అరియానా, అవినాష్, హారిక, మెహబూబ్, అఖిల్‌లను దెయ్యాలుగా మార్చినట్టు కనిపిస్తోంది. మిగిలిన వారంత మంచి మనుషులుగా ప్రవర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నట్టుంది.
దెయ్యాల రచ్చ..
ఇక దెయ్యాలు బిగ్ బాస్ ఇంటిని పీకి పందిరి వేసినట్టు కనిపిస్తోంది. బెడ్రూం, కిచెన్, గార్డెన్ ఏరియా ఇలా ప్రతీ ఒక్క దాన్ని నాశనం చేస్తోన్నట్టు కనిపిస్తోంది. దెయ్యాలు ఎంత రెచ్చగొట్టినా మనుషులు హద్దులు దాటకూడదనే నిబంధనను పెట్టినట్టున్నాడు. అందుకే మనుషులు ఎవ్వరూ కూడా అంతగా రియాక్ట్ అవ్వడం లేదు.
Recommended Video
అవినాష్ అదుర్స్..
ఇక ఇలాంటి టాస్కులు ఇస్తే అవినాష్ తనలోని టాలెంట్ చూపిస్తాడన్న సంగతి తెలిసిందే. రాక్షస రాజుగా అవినాష్.. తన మిమిక్రీ మహిమతో దుమ్ములేపుతోన్నట్టు కనిపిస్తోంది. ఇళ్లంతా అవినాష్ సందడే కనిపిస్తోంది. ఇక మోనాల్ వద్దకు వెళ్లి అవినాష్ మిమిక్రీతో రెచ్చిపోవడం కసితో పగతో రగిలిపోతున్నానని ఎంతో ఆగ్రహంగా చెబితే.. మోనాల్ వెంటనే గట్టిగా పట్టేసుకుంది. దీంతో అరియానా సాయంతో మోనాల్ కౌగిలింత నుంచి బయటకు వచ్చేసినట్టు కనిపిస్తోంది. ఇక కొంటె రాక్షసులను మార్చేందుకు మనుషులకు బిగ్ బాస్ ఓ అవకాశం ఇచ్చాడు. మరి దీన్ని మనుషులు సద్వినియోగం చేసుకున్నారో లేదో చూడాలి.