Bigg Boss 4 Unseen.. అలా అనడం అరియానా తప్పే.. మెహబూబ్‌కు అభిజిత్ సపోర్ట్
బిగ్‌బాస్ షోలో ఏడో వారం నామినేషన్ ప్రక్రియ శాంతంగానే ముగిసింది. ప్రేమగా ఉన్న ఇద్దరిని జంటలుగా చేశాడు. శత్రువులుగా ఉన్న వారిని జంటలుగా చేశాడు. ఇక ఆ జంటల్లో ఎవరో ఒకరు నామినేట్ అవ్వాలని, ఇంకొకరు సేవ్ అవ్వాలని బిగ్ బాస్ ఆదేశించాడు. అలా మోనాల్ అఖిల్, అవినాష్ సోహెల్, అభిజిత్ హారిక, లాస్య దివి, మెహబూబ్ అరియానాలను జంటగా విడగొట్టారు. ఇక మీలో మీరు వాదించుకోండి.. తగువులు పెట్టుకోండి చివరకు మాత్రం ఎవరో ఒకరు నామినేట్ అవ్వండి, ఇంకొకరు సేవ్ అవ్వండని తెలిపాడు.

అందరూ ఓకే..
నామినేషన్ ప్రక్రియలో అన్ని జంటలూ ఓ కొలిక్కి వచ్చాయి. ఎక్కువ చర్చలు పెట్టకుండానే ఓ నిర్ణయానికి వచ్చాయి. అఖిల్ మోనాల్, అభిజిత్ హారిక, లాస్య దివిలు ఎక్కువ సేపు చర్చలు పెట్టకుండానే నిర్ణయానికి వచ్చారు. మోనాల్, అభిజిత్, దివిలు నామినేట్ అయ్యేందుకు సిద్దపడ్డారు.

ఆ రెండు జంటలు..
అవినాష్ సోహెల్, మెహబూబ్ అరియానాలు మాత్రం చాలా సేపు వాదించుకున్నారు. సోహెల్ అవినాష్ చర్చల్లో మాత్రం కొద్ది సేపటికి ముగిశాయి. కాస్త వెనక్కి తగ్గి అవినాష్ నామినేట్ అయ్యేందుకు ముందుకు వచ్చాడు. ఒక్కసారి కూడా నామినేట్ అవ్వలేదు కదా అని నామినేట్ అవ్వమంటున్నారు.. అది నాకు న్యాయంగా అనిపించడం లేదంటూనే నామినేట్ అయ్యాడు.

అరియానా అలా..
ఇక అరియానా మెహబూబ్ ఇద్దరూ ఎలాంటి వారో అందరికీ తెలిసిందే. ఇద్దరూ కూడా ఒకే రకం. తాము పట్టిన పట్టును వదలరు. అయితే ఎన్నో చర్చలు, వాదోపవాదాలు, ఇంకెన్నో పాత ఘటనలను గుర్తుకు తెచ్చుకుని మరీ వాదించుకున్నారు. నాకు అర్హత ఉంది.. నేను ఇంట్లో ఉండాలని అనుకుంటున్నాను అని ఇద్దరూ ఒకే పాట పాడారు. చివరకు అరియానానే తలొగ్గింది.

రిక్వెస్ట్‌లు ఫలించాయి..
అరియానా మొదటగా మెహబూబ్‌ను నామినేట్ అవ్వమని రిక్వెస్ట్ చేసింది. మెహబూబ్ కూడా తరువాత అదే రిక్వెస్ట్‌ను అరియానా వద్ద పెట్టాడు. ఇక మెహబూబ్ ఎలాగూ సాయం చేయడు, నామినేట్ అవ్వడు అని పంతాన్ని వదిలేసింది. వదిలేసే ముందు అరియానా కొన్ని మాటలు అనేసింది. నన్ను అడిగావ్ సాయం చేశావ్.. పో బతుకు పో అంటూ ఓ చూపు చూసింది. నువ్ ఆట ఎలా ఆడతావో నేనూ చూస్తా అని కోపంలో అనేసింది.

ఆ మాటపై చర్చ..
అరియానా నామినేట్ అయ్యాక అఖిల్, సోహెల్ వచ్చి ఓదార్చారు. అయితే మెహబూబ్ మాత్రం అరియానా అన్న మాటతో బాగానే హర్ట్ అయ్యాడు. ఇదే విషయంపై మెహబూబ్, అభిజిత్, సోహెల్ చర్చించుకున్నారు. నీ సంగతి చూస్తా.. ఆట ఎలా ఆడతావో చూస్తా అని అనడం తప్పేనని అభిజిత్ మెహబూబ్‌కు మద్దతు తెలిపాడు. తాను పాజిటివ్‌గా అని ఉంటుందని సోహెల్ మెహబూబ్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.


Click it and Unblock the Notifications











