twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంత చేయమంటే అంత చేస్తుంది.. అరియానా పరువుదీసిన సోహెల్

    |

    బిగ్ బాస్ షోలో ఏడో వారం ముగిసేందుకు వచ్చింది. ఏడో వారంలో ఇంటి సభ్యులకు కొంటె రాక్షసులు మంచి మనుషులు అనే టాస్క్ ఇచ్చాడు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ మూవీ టాస్క్ ఇచ్చాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ అంతా కూడా సినిమా సెట్‌లా మారిపోయింది. ఒక్కొక్కరు తమకు ఇచ్చిన పాత్రలను ఇరగదీశారు. కొరియోగ్రాఫర్ దర్శకుడుకి, దర్శకుడు రైటర్‌కి మద్య వాగ్వాదాలు జరిగాయి. ఇక చివరకు స్క్రిప్ట్ రైటర్ కమ్ హీరోగా చేసిన అవినాష్ అలిగాడు.

    ప్రేమ మొదలైంది..

    ప్రేమ మొదలైంది..

    ఓ సినిమా తీయమని బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడంతో పాటు.. అభిజిత్ దర్శకుడిగా, దివి సహాయ దర్శకురాలిగా, నోయల్ కెమెరామెన్‌గా, అవినాష్ స్క్రిప్ట్ రైటర్‌గా వ్యవహరించారు. కొరియోగ్రాఫర్‌గా అమ్మ రాజశేఖర్‌ను ఫిక్స్ చేసి.. హారిక, సోహెల్‌లకు స్పెషల్ ఐటం సాంగ్‌ చేయాలని ఆదేశించాడు. అలా ‘ప్రేమ మొదలైంది' అనే సినిమాను షూట్ చేసేశారు.

     గొడవలతోనే పూర్తి..

    గొడవలతోనే పూర్తి..

    ఓ సినిమా అన్నాక ఎంత మందితో గొడవలు వస్తాయి.. మనస్పర్దలు, క్లాషెస్ వస్తాయో చెప్పకనే చెప్పేశారు. కొరియోగ్రాఫర్ దర్శకులుగా వ్యవహరించిన అమ్మ రాజశేఖర్ అభిజిత్ మధ్య గొడవ అయింది. అలాగే స్క్రిప్ట్ రైటర్ కమ్ హీరో అయిన అవినాష్ దర్శకుడు అభిజిత్‌కు మధ్య గొడవలు అయ్యాయి.

    అలిగిన అవినాష్..

    అలిగిన అవినాష్..

    టేకులు మీద టేక్‌లు తీస్తున్నారని చివరకు అవినాష్ అలిగి వెళ్లిపోయాడు. అవసరం లేకపోయినా లాస్య మధ్యలో వచ్చి టచ్ అప్ అంటూ డిస్టర్బ్ చేస్తోందని, అసిస్టెంట్ డైరెక్టర్ అయిన దివి జోకులు చేస్తూ మధ్యలో డిస్టర్బ్ చేస్తోందని అవినాష్ ఫైర్ అయ్యాడు.

    ప్రేమ మొదలైంది ప్రీమియర్..

    ప్రేమ మొదలైంది ప్రీమియర్..

    ఇక నేటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లందరూ కలిసి తీసిన ప్రేమ మొదలైంది ప్రీమియర్ వేసినట్టు కనిపిస్తోంది. ఇందులో యాంకర్‌గా అరియానా తన ప్రతిభను చాటాలనుకున్నట్టుంది. వచ్చిన ప్రతీ ఒక్కరికి మైకు పెట్టి ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా సోహెల్ అరియానాపై సెటైర్ వేశాడు.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : Jordar Sujatha Re Entry In Bigg Boss House
    ఐటెం రాజా..

    ఐటెం రాజా..

    ప్రేమ మొదలైంది సినిమాలో ఐటెం సాంగ్‌ చేసిన సోహెల్‌కు మైకు పెట్టి అడిగింది అరియానా. ఇక అరియానా ఏవేవో ప్రశ్నలు సంధిస్తుండటంతో .. ఇంత చేయమంటే అంత చేస్తుంది అంటూ అరియానా పరువు తీసేశాడు సోహెల్. మొత్తానికి ఈ ప్రీమియర్‌ షో అదిరిపోయినట్టు కనిపిస్తోంది. ఇక వీకెండ్ హోస్ట్‌గా రాబోతోన్న సమంత ఈ సినిమాపై ఎలాంటి కామెంట్ చేస్తుందో చూడాలి.

    English summary
    Bigg Boss 4 Telugu Week 7 Abhijeet Satires On Akhil Monal Romance, Bigg Boss Blockbuster Tas, Prema Modhalaindhi Movie, Bigg Boss 4 Telugu Avinash Akhil About Ariyana, Amma Rajasekhar And Sohel Conversation About Divi, Bigg Boss 4 Telugu week 7,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X