twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోనాల్ బాధ చూడలేకపోయిన అఖిల్.. అభిజిత్‌తో రాయభారం సక్సెస్ అయ్యేనా?

    |

    బిగ్‌బాస్ షోలో ఎనిమిదో వారం ప్రారంభంలోనే గొడవలు మొదలయ్యాయి. నామినేషన్ ప్రక్రియలో మళ్లీ పాత గాయాలు మళ్లీ రేగాయి. ఎప్పుడో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ నామినేషన్లు చేశారు. ఈ ప్రక్రియలో అమ్మ రాజశేఖర్ వల్ల అభిజిత్ అఖిల్ మోనాల్ ట్రాక్ మళ్లీ తెరపైకి వచ్చింది. అభిజిత్ కూడా పాత విషయాలను గుర్తు పెట్టుకుని మోనాల్‌ను నామినేట్ చేశాడు. ఈ ప్రాసెస్ మొత్తం అటూ ఇటూ తిరిగి మోనాల్‌పైనే పడింది.

    అమ్మ రాజశేఖర్ మొదలెట్టాడు..

    అమ్మ రాజశేఖర్ మొదలెట్టాడు..

    మామూలుగా గత వారంలోనే కంటెస్టెంట్లను నాగార్జున ఓ విషయంలో హెచ్చరించాడు. నామినేషన్ విషయంలో ఎవరి సంగతులు వారే మాట్లాడుకోవాలి.. ఒకరి గురించి ఇంకొకరు మాట్లాడుకోకండి అంటూ గట్టిగానే చెప్పాడు. కానీ అమ్మ రాజశేఖర్ అఖిల్‌ను నామినేట్ చేస్తూ మోనాల్ అభిజిత్ విషయాన్ని ప్రస్తావించాడు.

    అఖిల్-అమ్మ రాజశేఖర్ వాగ్వాదం..

    అఖిల్-అమ్మ రాజశేఖర్ వాగ్వాదం..

    మోనాల్‌తో అభిజిత్ మాట్లాడటం లేదు.. కానీ అభిజిత్‌తో నువ్ మాట్లాడుతున్నావ్.. నీ బెస్ట్ ఫ్రెండ్ మోనాల్ అంటావ్.. నువ్వే ఎవ్రీథింట్ అని ఆమె అంటుుంది. అలాంటామే అభిజిత్‌తో దూరంగా ఉంటే నువ్ మాత్రమే అతనితో మాట్లాడుతున్నావ్ అది న్యాయం కాదు అంటూ అమ్మ రాజశేఖర్ అన్నాడు.

    అభిజిత్ అలా..

    అభిజిత్ అలా..

    ఇక అభిజిత్ మోనాల్‌ను నామినేట్ చేస్తూ ఎప్పుడో జరిగిన పాత విషయాన్ని గుర్తు చేశాడు. తనను మ్యానిపులేటివ్ అని అనడం, దాని గురించి సోహెల్, మెహబూబ్, స్వాతి, మోనాల్ మాట్లాడుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆ విషయంపై మోనాల్‌ను నామినేట్ చేశాడు. ఇలా మళ్లీ మళ్లీ పాత విషయాలను గుర్తు చేసి నామినేట్ చేయడంపై మోనాల్ బాధపడినట్టు కనిపిస్తోంది.

    అఖిల్ రాయబారం..

    అఖిల్ రాయబారం..

    ఒక్కసారి మ్యాటర్‌ను క్లియర్‌గా మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవాలని అఖిల్ మోనాల్‌కు సర్దిచెప్పాడు. ఎన్నిసార్లు చేసుకోవాలి అంటూ మోనాల్ ఏడుస్తుండగా.. ఆ విషయం ఇంకా మీరు మాట్లాడుకోలేదంటూ అఖిల్ బుజ్జగించాడు. పోనీ అభిజిత్‌తో నేను మాట్లాడనా అంటూ మోనాల్‌ వద్ద పర్మిషన్ తీసుకున్నాడు. మోనాల్ అంగీకరించడంతో అభిజిత్‌తో అఖిల్ మాట్లాడాడు. మరి అభి కూల్ అవుతాడా? లేదా ఫైర్ అవుతాడా? అన్నది నేటి ఎపిసోడ్‌లో చూడాలి.

    English summary
    Bigg Boss 4 Telugu Week 8 Akhil Talks With Abijeet About Monal, Ariyana And Avinash Celebrate Bathukamma, Bigg Boss 4 Telugu Week 7 Abhijeet Satires On Akhil Monal Romance, Prema Modhalaindhi Movie, Bigg Boss 4 Telugu Avinash Akhil About Ariyana, Amma Rajasekhar And Sohel Conversation About Divi, Bigg Boss 4 Telugu week 7.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X