బిగ్‌బాస్‌లో బతుకమ్మ.. అవినాష్,అరియానా రచ్చ!!
బిగ్‌బాస్ షోలో ఎనిమిదో వారం మొదలైంది. ఇప్పటికి ఏడు వారాలు గడిచాయి. ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. గంగవ్వకు ఆరోగ్యం బాగా లేదని వెళ్లిపోయింది. ఇలా ఇప్పుడు ఇంట్లో పదకొండు మంది ఉన్నారు. ఎనిమిదో వారం నామినేషన్ కూడా జరిగింది. ఎనిమిదో వారానికి గానూ అమ్మ రాజశేఖర్, మోనాల్, అఖిల్, లాస్య, మెహబూబ్, అరియానా నామినేట్ అయ్యారు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో కొందరు ఇంటి సభ్యులు బతుకమ్మ ఆటను ఆడారు.
విజయ దశమి సందర్భంగా ఇంటి సభ్యుల్లో కొందరు బతుకమ్మ ఆట ఆడారు. అవినాష్, అరియానా, మోనాల్, లాస్య అందరూ కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలు పాడుతూ నిమజ్జనం కూడా చేశారు. అందులో అరియానా, అవినాష్ మాత్రం పాటలతో రెచ్చిపోయారు. చివరకు స్మిమ్మింగ్ పూల్‌లో ఇద్దరూ కలిసి నిమజ్జనం చేశారు. అయితే ఇంట్లో మాత్రం ఈ నలుగురే బతుకమ్మ అడారు.

మామూలుగా ఇంట్లో అందరూ కలిసి ఆటలు ఆడుతుంటారు. కానీ బతుకమ్మను మాత్రం ఈ నలుగురే ఆడారు. మిగతా వారు పాల్గొనకపోవడానికి కూడా కారణాలుండొచ్చు. ఈ నలుగురు ఏదో పేరుకు ఆడామా? అంటే అడినట్టున్నారు. ఓ ప్లేట్‌లో పూల చెట్టును పెట్టి ఓ నాలుగు చుట్లు తిరిగారు. అందుకే మిగతా వారు ఈ నలుగురిని అంతగా పట్టించుకోలేదేమో. బిగ్ బాస్ అఫిషియల్‌గా ఏదైనా అరేంజ్ చేసి ఉంటే మంచి ఈవెంట్‌లా చేసేవారేమో.


Click it and Unblock the Notifications











