హారిక పరువుదీసిన అవినాష్.. ఇమిటేషన్‌తో అందర్నీ నవ్వించేశాడు!!
బిగ్ బాస్ షోలో సండే అంటే ఫండే. శనివారం వరకు ఎంత హీటెక్కి ఉన్నా సరే ఆదివారం మాత్రం కంటెస్టెంట్లందర్నీ కూల్ చేస్తాడు నాగార్జున. నిన్న నాగార్జున ముందే అంత పెద్ద పంచాయితీ పెడుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు చూస్తుండిపోయాడు. ఇక గొడవ అంతా తగ్గుతున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి అవినాష్, అమ్మ రాజశేఖర్‌లకు సర్దిచెప్పాడు. సరే నోయల్ తన బాధంతా వెల్లగక్కిపోయాడు.
అయితే ఇంట్లో హీటెక్కి ఉన్న వాతావరణాన్ని కూల్ చేయాల్సిన బాధ్యత నాగార్జునదే కదా. నిన్న అంతలా రెచ్చిపోయి హర్టైన అవినాష్‌ను నేడు పైకి లేపినట్టు కనిపిస్తోంది. ఈ ఆదివారం ఎపిసోడ్ మొత్తం అవినాష్ హైలెట్ అయ్యేట్టు కనిపిస్తోంది. అవినాష్ ఇమిటేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కొన్ని సార్లు కొంత మంది హర్టైనా కూడా కామెడీ మాత్రం బాగానే పండుతుంది. అందుకే ఈ సండే ఎపిసోడ్‌లో అవినాష్ అందర్నీ ఇమిటేట్ చేసి చూపించినట్టు కనిపిస్తోంది.

హారిక చిన్న పిల్లలా చేసే చేష్టలు, అభిజిత్‌తో ఉన్న సమయంలో ప్రవర్తించే తీరును అవినాష్ అచ్చుగుద్దినట్టు చేసి చూపించాడు. చిన్న పిల్లలా గెంతుతూ వచ్చి అభిజిత్‌ను హత్తుకోవడం, ఆ క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కూడా దించడంతో అందరూ నవ్వేశారు. హారిక మాత్రం కాదు కాదు అంటూ చేతిని ఊపుతోంది. ఇలా హెల్దీ ఇమిటేషన్, కామెడీని ఎవ్వరైనా ఇష్టపడుతుంటారు. అమ్మ రాజశేఖర్‌లా నటించి అందర్నీ కడుపుబ్బా నవ్వించినట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











