గాలికి పోయేదాన్ని తగిలించుకుంది.. అలా మిస్ ఫైర్ అయింది.. అరియానా బుక్కైంది!!

బిగ్ బాస్ షోలో అమ్మ రాజశేఖర్‌ది ఓ వింత క్యారెక్టర్ అని అందరికీ అర్థమైపోయింది. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో చెప్పడం కష్టమే. ఒక్కోసారి బాగానే ఉంటాడు. ఒక్కోసారి నిప్పులు తొక్కినవాడిలా విరుచుకుపడతాడు. ఎప్పుడు ఎవరి మీద ఫైర్ అవుతాడో ఎందుకు ఫైర్ అవుతాడో చెప్పలేం. నిన్నటి ఎపిసోడ్‌లో అరియానాను ఓ రేంజ్‌లో ఆడేసుకున్నాడు. అరియానా కూడా గాలికి పోయే దాన్ని అంటించుకుంది. మొత్తం రచ్చ రచ్చ అయింది. అసలు ఏం జరిగిందో ఓ సారిచూద్దాం.

కెప్టెన్సీ టాస్క్..

కెప్టెన్సీ టాస్క్..

ఎనిమిదో వారంలో అమ్మాయిలందరికీ బిగ్ బాస్ ఓ ఆఫర్ ఇచ్చాడు. కేవలం అమ్మాయిలకు మాత్రం కెప్టెన్సీ పోటీకి అర్హత ఉంటుందని తెలిపాడు. కానీ ఆడేది మాత్రం మగవారు. వారు తాళంచెవి కోసం పోట్లాడి వారికి నచ్చిన అమ్మాయిలకు ఇవ్వొచ్చు. ప్రతీ ఒక్క అమ్మాయి తాను కెప్టెన్ ఎందుకు కావాలో మీకు విన్నవించుకుంటుంది. అలా అందరిలో ఎవరికి ఇవ్వదలుచుకున్నారో వారికి ఇవ్వొచ్చని టాస్క్ పెట్టాడు. అలా కీ వచ్చిన అమ్మాయి కత్తిని తీసుకుని చెట్టుపై ఉన్న యాపిల్‌పై మహిళా కంటెస్టెంట్ల ఫోటోలు ఉంటాయని, తమకు నచ్చని, కెప్టెన్‌గా అర్హత లేని వారిని కట్ చేయాల్సి ఉంటుందని తెలిపాడు.

అరియానా కెప్టెన్‌గా..

అరియానా కెప్టెన్‌గా..

అలా మొదటి సారి అఖిల్ తాళంచెవిని సొంతం చేసుకుని మోనాల్‌కు ఇచ్చాడు. మోనాల్ కత్తి అందుకుని హారిక బొమ్మ ఉన్న యాపిల్‌ను కట్ చేసింది. రెండో సారి మెహబూబ్ తాళాన్ని చేజిక్కించుకుని అరియానాకు ఇవ్వగా లాస్య బొమ్మ ఉన్నయాపిల్‌ను కట్ చేసింది. చివరగా అమ్మ రాజశేఖర్ తాళంచెవిని చేజక్కించుకున్నాడు. మోనాల్‌కు సారీ చెప్పి.. భవిష్యత్తులో సాయం చేస్తానని చెప్పి ఆ తాళాన్ని అరియానాకు అప్పగించాడు. అలా అరియానా మోనాల్ బొమ్మ ఉన్న యాపిల్‌ను కట్ చేసేసింది. చివరకు చెట్టుపై అరియానా బొమ్మ ఉన్న యాపిల్ ఉండటంతో కెప్టెన్‌గా ఎన్నికైంది.

అమ్మ రాజశేఖర్ గొడవ..

అమ్మ రాజశేఖర్ గొడవ..

కెప్టెన్‌గా ఎన్నికైన అరియానా రేషన్ మేనేజర్‌గా మోనాల్‌ను ఎంచుకుంది. అక్కడితో ఊరుకున్నా సరిపోయేది. అమ్మ రాజశేఖర్ మీకు మాటిచ్చారు కదా అందుకే మీకు రేషన్ మేనేజర్‌గా అవకాశం ఇస్తున్నా అని మోనాల్‌తో అనడంతో రాజ శేఖర్ హర్ట్ అయ్యాడు. అలా ఎలా అంటావ్ అది నేను ఇచ్చిన మాట నేను నెరవేర్చుకుంటాన. నీకు ఎందుకు అంటూ అరియానాపై ఫైర్ అయ్యాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Ariyana Glory Glamour Show చీరకట్టులో అరియానా గ్లోరి అందాల ఆరబోత...!!
రేషన్ మేనేజర్ చేయలేదని..

రేషన్ మేనేజర్ చేయలేదని..


కెప్టెన్‌గా నేను నీకు సాయం చేస్తే నువ్ నాకు రేషన్ మేనేజర్ ఇవ్వవా అంటూ అరియానాపై మాస్టర్ ఫైర్ అయ్యాడు. ఇదే గొడవలో అరియానాను ఇష్టమొచ్చిన మాటలు అనేశాడు. కెప్టెన్ అయిన సంతోషాన్ని కాసేపు కూడా ఉండనివ్వలేదు. మోనాల్‌ను రేషన్ మేనేజర్ చేసి మంచి పేరు కొట్టేయాలని అనుకున్న అరియానా ప్రయత్నం మిస్ ఫైర్ అయింది. గతవారంలో అవినాష్ తనకు రేషన్ మేనేజర్‌గా ఇచ్చినట్టుగా.. తాను ఈ సారి మోనాల్‌కు ఇస్తున్నట్టు అరియానా భావించింది. కానీ మాస్టర్ మాత్రం అరియానాను ఓ రేంజ్‌లో తిట్టిపోశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X