దివికి బంపర్ ఆఫర్.. స్పెషల్ మీటింగ్‌లో నాగార్జున అలా అన్నాడట!
బిగ్ బాస్ దసరా ఎపిసోడ్‌లో సమంత సందడి చేసింది. సమంత వచ్చింది, దసరా పండుగ కదా ఇక ఎలిమినేషన్ ఉండదేమో అని అందరూ సంబరపడ్డారు. కానీ చివరకు దివి ఎలిమినేట్ అయింది. అయితే ఎలిమినేట్ అయిన ప్రతీ కంటెస్టెంట్‌తో ఇంటి సభ్యుల గురించి కొన్ని మాటలు చెప్పిస్తాడు నాగార్జున. కానీ సమంత మాత్రం అలాంటిదేమీ చెప్పించలేదు. దివి అభిప్రాయాలను కూడా అడగలేదు. అలా దివి ఊరికే వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇక కింగ్ నాగార్జునతో మాట్లాడే అవకాశాన్ని కూడా కోల్పోయింది.

అందరూ బాగానే వెళ్లారు..
ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను నాగార్జున నవ్వుతూనే పంపాడు. కొందరికీ అభయమిచ్చాడు. ఇంకొందరిని ఓదార్చాడు. గంగవ్వ లాంటి వాళ్లకు ఇళ్లు కట్టిస్తానని మాటిచ్చాడు. కుమార్ సాయి లాంటి వారికి స్క్రిప్ట్ వింటానని మాటిచ్చాడు. కానీ దివి మాత్రం నాగార్జునతో అలా దగ్గరిగా మాట్లాడే అవకాశాన్ని కోల్పోయింది.

సమంత అలా చేసింది..
అయితే సమంత కూడా దివికి తక్కువేమీ చేయలేదు. స్టేజ్ మీదే హీరో కార్తికేయతో మాట్లాడి హీరోయిన్‌గా ఛాన్స్ ఇంపించింది. సమంత చెప్పిందన్న మొహమాటానికేమో ఏమో గానీ ఓకే అన్నాడు. అయినా దివి క్రేజ్ ముందు ఆ ఆఫర్ చాలా తక్కువే. ఏది ఏమైనా నాగార్జునతో మాట్లాడే చాన్స్ మాత్రం దివి మిస్ అయింది.

అందుకే స్పెషల్ మీటింగ్..
అలా నాగ్‌ను కలుసుకునే చాన్స్ మిస్ అవ్వడంతో నేడు స్పెషల్‌గా కలిసిందట. అన్నపూర్ణ స్టూడియోల దివి నాగార్జునను ప్రత్యేకంగా కలిసింది. ఈ మేరకు ఆ మీటింగ్‌లో నాగార్జున అన్న మాటలకు పరవశించిపోతోన్నట్టు తెలుస్తోంది. దివి షేర్ చేసిన ఫోటో, చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

అలా అన్నాడట..
దివి నువ్ చాలా కాన్ఫిడెంట్.. ఎంతో మందిలో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశావ్ అని నాగార్జున ప్రశంసించాడు. ఈ మేరకు దివి గాల్లో తేలిపోయింది. ఒక్కోసారి కొన్ని నిమిషాలే కలిసి మాట్లాడినా మనలో ఎంతో నమ్మకం ఏర్పడుతుంది.. అంత గొప్పగా నా గురించి చెప్పినందుకు థ్యాంక్స్ సర్ అంటూ దివి ఎమోషనల్ అయింది.


Click it and Unblock the Notifications











