Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మోనాల్ మాటలకు హర్టైన హారిక.. ముగ్గురిని లాగడంపై ఫైర్
బిగ్ బాస్ షోలో ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారు? గేమ్ ఎలా ఆడతారు? అన్నది ఎవ్వరూ ఊహించలేదు. క్షణక్షణానికి స్ట్రాటజీ మార్చాల్సి ఉంటుంది. అలా మార్చుతూనే ఆడుతుంటారు. తాజాగా నిన్నటి ఎపిసోడ్లో మోనాల్ కావాలని హారికను టార్గెట్ చేసిందో లేదా ఇన్ని రోజులుగా ఉన్న అక్కసును బయటపెట్టిందో గానీ టార్గెట్ చేసేసింది. మోనాల్‌కు అఖిల్ మొదటి అవకాశాన్ని సంపాదించి పెట్టడంతో,.. హారికను బలి చేసింది.
ఆడవాళ్లకు మాత్రం అవకాశం అంటూ ఇచ్చిన ఈ కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా మోనాల్ మొదటగా హారికను బలి చేసింది. మామూలుగా అక్కడ మోనాల్ తెలివిని ప్రదర్శిస్తే కెప్టెన్ అయ్యే చాన్స్ ఉండేది. కానీ ఆమె గుడ్డిగా హారికను టార్గెట్ చేసి బలి చేసింది. హారికకు అభిజిత్ నోయల్ లాస్య సపోర్ట్ ఉందని చెబుతూ కెప్టెన్సీ పోటీలోంచి తప్పించేసింది. కానీ అక్కడ అరియానాకు అవినాష్, అమ్మ రాజశేఖర్, సోహెల్, మెహబూబ్ సాయం చేస్తారని కనిపెట్టలేకపోయింది.
అయితే హారిక మాత్రం మోనాల్ చెప్పిన కారణాలు, అభిజిత్ నోయల్ లాస్య అంటూ మధ్యలోకి లాగడంపై హర్ట్ అయింది. అలా ఎలా అంటుంది.. ప్రతీ టాస్క్ తన సొంతంగానే ఆడుకుంటున్నానని, ఎవ్వరూ కూడా హెల్ప్ చేయడం లేదు కదా అని చెప్పుకొచ్చింది. ఆ ముగ్గురు నామినేషన్ చేయకపోతే మిగతా వారంతా నామినేట్ చేస్తారు.. కదా అని మోనాల్‌తో వాదించింది. మొత్తానికి తన తెలివి తక్కువదనంతో మోనాల్ కెప్టెన్ అయ్యే అవకాశాన్ని చేజార్చుకుంది.