పాపం లాస్య అలా బలి.. సిల్లీ కారణాలతో నామినేషన్‌లోకి!!
ప్రతీసారి నామినేషన్ ప్రక్రియ జరగడం, ఎలిమినేట్ అవ్వడం సర్వసాధారణం. అయితే ఇందులో కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఎన్నిసార్లు చెప్పినా సరే సరైన కారణాలను మాత్రం వెల్లడించారు. ఏవేవో సిల్లీ కారణాలను చెప్పి నామినేట్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా లాస్య విషయంలో ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. ఆమె విషయంలో చెప్పే కొన్ని కారణాలు మరీ నవ్వు తెప్పించేలా ఉంటాయి.
ఆమెను ఫేక్ స్మైల్ అంటూ నామినేట్ చేస్తూ వస్తారు. అది కామన్ రీజన్. ఇక పప్పు బాగా వండలేదు అంటూ దివి చేసిన నామినేషన్ వరెస్ట్ అన్నది అందరికీ తెలిసిందే. తరువాత దివి కూడా ఆ విషయంలో బాగానే బాధపడింది. ఆ టాపిక్ కూడా బాగానే ట్రెండ్అయింది, అయితేఈ ఏడో వారంలోనూ లాస్యకు అలాంటి సిల్లీ కారణాలే ఎదురయ్యాయి. అమ్మా రాజశేఖర్ గతంలో జరిగిన వాటిని గుర్తు చేస్తూ ఫేక్ అంటూ నామినేట్ చేసేశాడు.

ఇక అవినాష్ కూడా మరీ ఘోరమైన కారణం చెప్పి నామినేట్ చేశాడు. టీ పెట్టలేదు, టీ పోయలేదు అని చెప్పి నామినేట్ చేశాడు. వదిన, అక్కలా అంటూనే నామినేట్ చేసేశాడు. ఇక మోనాల్ కూడా అదే బాటలో నడిచింది. తన కోసం వెజిటీరియన్ వండలేదు.. పన్నీర్ అయిపోయిందంటూ నామినేట్ చేసేసింది. ఇలా మొత్తానికి ఎనిమిదో వారంలో లాస్య నామినేట్ అయింది. మరి చివరకు ఫలితం ఎలా వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











