అవినాష్‌కు మోనాల్ ముద్దు... నోరెళ్లబెట్టిన అరియానా.. షాకైన అఖిల్
బిగ్ బాస్ షోలో ఎప్పుడు ఏది ఎందుకు జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒక్క క్షణంలోనే అంతా మారుతుంది. కొందరి మధ్య జరిగిన సంఘటనలు ఇంకొందరి మధ్య దూరాన్ని పెంచడమే, దగ్గర చేయడమో జరుగుతుంది. అలా మోనాల్ అభిజిత్ గొడవ వల్ల అవినాష్‌కు బాగా కలిసి వచ్చింది. మామూలుగా అయితే మోనాల్ మొదట్లో ఇద్దరితోనే క్లోజ్‌గా ఉండేది. పగలు అఖిల్.. రాత్రి అభిజిత్‌తో ముచ్చట్లు పెట్టేది.

ట్రయాంగిల్ కథ..
మొదటి రెండు మూడు వారాలు అఖిల్ మోనాల్ అభిజిత్ ట్రయాంగిల్ కథ బాగానే నడిచింది. మోనాల్‌కు కష్టమొస్తే ఇద్దరూ దగ్గరకు రావడం అక్కున చేర్చుకోవడం ప్రేమను పంచడం వంటివి చేశారు. రాను రాను అఖిల్ అభిజిత్ మధ్య దూరం పెరిగింది. చివరకు అఖిల్ మోనాల్ ఒక్కటయ్యారు.

అభిజిత్ దూరం పెట్టేశాడు..
ఆరో వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా జరిగిన రచ్చతో మోనాల్ అభిజిత్ మధ్య దూరం పెరిగింది. అఖిల్ అభిజిత్ నామినేషన్ మధ్యలో మోనాల్ టాపిక్ రావడం, ఆమె కన్నీరుమున్నీరవ్వడం అందరికీ తెలిసిందే. ఇదే విషయంపై నాగార్జున దగ్గర ఒకలా తన దగ్గర ఒకలా మాట్లాడటంతో అభిజిత్ హర్ట్ అయ్యాడు. అక్కడి నుంచి మోనాల్‌కు దూరంగా ఉండిపోయాడు.

అవినాష్‌తో క్లోజ్..
అలా అభిజిత్ తనన దూరం పెట్టడంతో మోనాల్ రాత్రి పూట ఒంటరైంది. అసలే అఖిల్ రాత్రి త్వరగా పడుకుంటాడట. అలా అవినాష్ క్రమేపీ మోనాల్‌కు దగ్గరయ్యాడు. రాత్రి పూట పాటలు పాడుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ రచ్చ రచ్చ చేశారు. ఈ మధ్య మోనాల్ అఖిల్, అవినాష్‌లతో చాలా క్లోజ్‌గా ఉంటోంది.

ముద్దుపెట్టడంతో..
నేటి ఎపిసోడ్‌లో అవినాష్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్టున్నాడు. అరియానా అవినాష్... అఖిల్ మోనాల్.. గార్గెన్ ఏరియాలో వేర్వేరుగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అవినాష్ మోనాల్‌ను పిలిచాడు. అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన మోనాల్ నుదుటిపై ముద్దు పెట్టడంతో అవినాష్ గాల్లో తేలిపోయాడు. పక్కనే ఉన్న అరియానా నోరెళ్లబెట్టేసింది.
Recommended Video

పొలంలో మొలకలొచ్చాయ్..
అలా ముద్దు పెట్టడంతో అవినాష్ ఆనందానికి హద్దుల్లేకుండాపోయాయ్. నా పొలంలో మొలకలొచ్చాయ్ అంటూ ఎగిరి గంతులేశాడు. A అంటే అవినాష్.,. మోనాల్ మనసులో తానే ఉన్నాను అందుకే ముద్దు పెట్టిందని గాల్లో తేలిపోయాడు. అవునా అంటూ అఖిల్ సెటైర్ వేశాడు.


Click it and Unblock the Notifications











