నామినేషన్స్‌లో అందర్నీ ఏసిపడేస్తా.. రాసి పెట్టుకోండి అంటూ సోహెల్ సవాల్
బిగ్ బాస్ షోలో ఎనిమిదో వారం జరిగిన నామినేషన్ ప్రక్రియ బాగానే చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. నామినేషన్ ప్రక్రియ అయి అందులో ఆరుగురు బలైనా కూడా ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎనిమిదో వారంలో అమ్మ రాజశేఖర్, అఖిల్, మోనాల్, లాస్య, అరియానా, మెహబూబ్‌లు నామినేట్ అయ్యారు. అయితే ఇందులో కొందరు సిల్లీ కారణాలతో నామినేట్ అయ్యారు. సాధారణంగా ప్రతీసారి అలాంటివి చెప్పే నామినేట్ చేస్తున్నారు.
పప్పు సరిగ్గా వండలేదని, టీ పెట్టివ్వలేదని, పన్నీర్ వండలేదని లాస్యను నామినేట్ చేశారు. అఖిల్, మెహబూబ్‌ల నామినేషన్‌లకు నోయల్ చెప్పిన కారణాలు ఎప్టటి నుంచో వింటూ వస్తున్నాం. స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అంటూ అఖిల్, మెహబూబ్‌ను నామినేట్ చేసేశాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వింత కారణాలు చెప్పి నామినేట్ చేశారు. వీటిపై నేడు ఇంట్లో చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

నామినేషన్ల గురించి మాట్లాడుతూ వచ్చే వారం అందర్నీ ఏసి పడేస్తా.. పెద్ద పెద్ద పంచాయితీలు జరగాలి అంటూ సోహెల్ అందరికీ సవాల్ విసిరాడు. ఇక తనను స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదని నోయల్ అనడంతో వంటగది వద్ద సోహెల్ రచ్చ రచ్చ చేశాడు. అమ్మ రాజశేఖర్ సోహెల్ మధ్య మళ్లీ ఏదో కోల్డ్ వార్ జరిగేట్టే కనిపిస్తోంది. ప్రోమోలో అయితే ఇళ్లు పీకి పందిరి వేసేవాడిలా కనిపిస్తున్నాడు. మరి నేటి ఎపిసోడ్‌లో సోహెల్ ఏం చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











