టాస్క్ భవిష్యత్తు లీక్.. హారిక సీక్రెట్ టాస్క్‌లో సక్సెస్.. అరియానాకు మళ్లీ లక్కీ ఛాన్స్!
పల్లెకు పోదాం ఛలో ఛలో అనే టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ ఊర్లో ఒక్కొక్కరికి ఒక్కో పాత్రను ఇచ్చాడు. సోహెల్ ఊరి పెద్ద. లాస్య అతని భార్య, అరియానా అతని కుమార్తె, లాస్య తమ్ముడిగా అఖిల్ నటిస్తారు. అయితే ఈ ఊర్లో అఖిల్ బాధ్యతలేని గ్రామస్థుడు, అరియానా గడుసరి పిల్ల అంటూ ఇలా ఒక్కొక్కరికి తమ పాత్రలను కూడా వివరించాడు. ఇందులో అమ్మ రాజశేఖర్ ఊరి పెద్దకు అన్ని విషయాలు చెబుతూ వెంటే ఉంటాడు. హారిక ఊర్లో పుకార్లు పుట్టిస్తూ.. అందరి పనుల్లో సాయం చేస్తుంటుంది. అంతేకాకుండా సీక్రెట్ టాస్క్ కూడా ఇచ్చాడు.

ఊర్లో రచ్చ..
ఊర్లో ఓ మంట ఉంటుంది. అది ఎప్పుడూ మండుతూనే ఉండాలి. దాన్ని ఆరకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఊరి పెద్ద అయిన సోహెల్. ఊరి పెద్ద ఎవరికి ఏ బాధ్యతలైనా అప్పగించవచ్చు.. ఊర్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాల్సి ఉంటుంది. లాస్య తమ్ముడైనా అఖిల్ మాత్రం గొడవలు పెట్టుకుంటూ ఊర్లో పరువు తీస్తుంటాడు.

ఊరి పెద్ద కూతురు అలా...
ఊరి పెద్ద కూతురు అరియానా గడుసరి పిల్ల కావడంతో అల్లరి మొదలవుతుంది. ఆ ఊర్లో పాన్ షాప్ నడుపుకునే రంగ (అవినాష్) అరియానాను ప్రేమిస్తుంటాడు. అతని తమ్ముడు శ్రీను హారికను ప్రేమిస్తుంటాడు. హారిక ఊర్లో అందరితో కొంటెగా ప్రవర్తిస్తుంటుంది. పుకార్లు పుట్టిస్తుంది. సమయానుగుణంగా హత్యలు కూడా చేస్తోంది.

అమ్మ రాజశేఖర్‌ను చంపేసింది..
అయితే కట్టెల కోసం అందరూ ఫైట్ చేస్తుండగా.. సరైన సమయం కోసం హారిక ఎదురుచూసింది. అమ్మ రాజశేఖర్ పాన్ షాప్ యజమానితో గొడవ పడుతుండగా.. హారిక కాఫీ పోసేసింది. అమ్మ రాజశేఖర్ మీద కాఫీ పోసి హత్య చేయాలని ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లోని ఒక పనిని చేసింది.

సక్సెస్ అయినట్టుంది..
హారిక తన సీక్రెట్ టాస్క్‌లో అయినట్టు కనిపిస్తోంది. అవినాష్‌కు కోపం తెప్పించడం, ఏదైనా ఓ విండోపై లిప్ట్ స్టిక్ ఓ పేరు రాయడం వంటి పనులను కూడా చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ సీక్రెట్ టాస్క్ పూర్తి చేసి హారిక కెప్టెన్సీ పోటీ దారురాలిగా మారినట్టుంది.

ఆ ముగ్గురి మధ్యే..
నాగార్జున ఇచ్చిన ఛాన్స్ ద్వారా అమ్మ రాజశేఖర్ నేరుగా కెప్టెన్ పోటీదారుడయ్యాడు. సీక్రెట్ టాస్క్ సక్సెస్ చేసి హారిక కూడా కెప్టెన్సీ పోటీలోకి రానుంది. ఇక టాస్క్‌లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చినందుకు అరియానా కూడా కెప్టెన్సీ పోటీలోకి వచ్చింది. ఈ ముగ్గురి మధ్య కెప్టెన్సీ పోటీ జరగనుంది. అరియానాకు మాత్రం ఇది అదృష్టమే. గతవారమే కెప్టెన్‌గా ఎన్నికైంది. మళ్లీ ఈ వారం కూడా అవుతుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











