తొమ్మిదో వారంలో కెప్టెన్‌గా అమ్మ రాజశేఖర్.. రింగులో రంగు టాస్క్ రిజల్ట్ లీక్!
బిగ్ బాస్ షోలో లీకులు కొత్తేమీ కాదు. ప్రతీది లీకవుతూనే ఉంటుంది. ఒకప్పుడు ఎలిమినేషన్, వైల్డ్ కార్డ్ ఎంట్రీల వరకే ఈ లీకులు పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం రేపటి ఎపిసోడ్‌లో ఏం జరగబోతోందో ముందే లీకై సమాచారం బయటకు వచ్చేస్తోంది. ఎలాంటి టాస్కులు ఇవ్వబోతోన్నారు. ఎవరు నామినేట్ అయ్యారు.. ఎవరు కెప్టెన్‌గా ఎన్నికయ్యారు వంటి విషయాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. తాజాగా తొమ్మిదో వారం కెప్టెన్సీ టాస్క్ ఫలితం కూడా లీకైంది.

తొమ్మిదో వారంలో అలా..
తొమ్మిదో వారానికి గానూ అమ్మరాజశేఖర్‌ను నేరుగా కెప్టెన్ పోటీదారుడని ప్రకటించాడు. అలా మంచి ఆఫర్ అమ్మ రాజశేఖర్‌కు వచ్చింది. ఇక మిగిలిన పోటీ దారులను ఎంచుకునేందుకు టాస్క్ పెట్టాడు. పల్లెకు పోదాం చలో చలో అనే టాస్క్ పెట్టాడు. బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన వారికి కెప్టెన్స్ పోటీకి అర్హత్ సాధిస్తారని తెలిసిందే.

సీక్రెట్ టాస్క్‌లో విజేత..
పల్లెకు పోదాం చలో చలో అనే ఆటలో హారికకు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ఇచ్చాడు. మూడు హత్యలు చేస్తే విజేతగా నిలుస్తావని చెప్పాడు. ఆ మూడు హత్యలను ఎలా చేయాలో కూడా వివరించాడు. అమ్మ రాజశేఖర్ మీద కాఫీ పోయాలి.. అవినాష్‌కు కోపం తెప్పించాలి.. లిప్ట్ స్టిక్‌తో ఏదైనా ఓ అద్దంపై పేరు రాయాలని తెలిపాడు. ఈ టాస్క్‌లన్నీ చేయడంతో కెప్టెన్సీకి అర్హత సాధించింది.

అరియానా అలా చేసింది..
గతవారంలో అరియానా చెప్పిన డైలాగ్‌లు, నిన్నటి ఎపిసోడ్‌లో అరియానా చెప్పిన మాటలను పక్క పక్కన పెట్టి నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అందరికీ సమానమైన అవకాశాలు రావాలి.. ఇంట్లో ఉన్న ఆడవారికి కెప్టెన్స్ అయ్యే చాన్స్ అందరికీ రావాలని గత వారం చెప్పింది. అయితే ఈ వారం బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన వారి పేరు చెప్పమనే సరికి తన పేరునే చెప్పుకొచ్చింది. అరియానా తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

రింగులో రంగు..
అలా తొమ్మిదో వారం కెప్టెన్సీ పోటీలో అమ్మరాజశేఖర్, అరియానా, హారికలు తలపడ్డారు. రింగులో రంగు అనే ఈ టాస్క్‌లో ముగ్గురు బాగానే పాల్గొన్నట్టు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో కనిపిస్తోంది. అయితే ఇందులో అమ్మరాజశేఖర్, అరియానా కలిసి ఆడినట్టు కనిపిస్తోంది. గత వారం సాయం చేసినందుకు బదులుగా ఈ వారం అమ్మ రాజశేఖర్‌కు అరియానా సాయం చేసినట్టు కనిపిస్తోంది. ఈఇద్దరూకలిసి హారికను ఓడించారని తెలుస్తోంది. చివరకు అమ్మరాజశేఖర్ కెప్టెన్‌గా అవుతాడని సమాచారం. అయితే టాస్క్‌లో నిజంగా ఏం జరుగుతుందో తెలియాలంటే నేడు ప్రసారం కానున్న ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











