వామ్మో ఊసరవెళ్లి కూడా దిగదుడుపే.. మోనాల్ విషయంలో అమ్మ రాజశేఖర్ మాట మార్చేశాడు!!
బిగ్ బాస్ షోలో కథ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అప్పుడు ఫ్రెండ్స్ అంటారు.. మళ్లీ అప్పుడు గొడవలు పెట్టేసుకుంటారు. మరీ ముఖ్యంగా అమ్మ రాజశేఖర్ విషయంలో ఇలాంటివి తరుచు జరుగుతూ ఉంటాయి. జీవితంలో మాట్లాడను అంటాడు.. వెంటనే మళ్లీ కూల్ అయిపోయి సెట్ అవుతాడు. జీవితంలో నిన్ను నమ్మను అంటాడు.. మళ్లీ వచ్చి మాట్లాడతాడు. ఇలా ప్రతీసారి అమ్మ రాజశేఖర్ తన మాటలను మార్చేస్తుంటాడు. తాజాగా మోనాల్ విషయంలోనూ అదే చేశాడు.

మోనాల్‌తో అలా..
ఎనిమిదో వారంలో కెప్టెన్సీ పోటీలో చివరకు మోనాల్, అరియానా ఉంటే అమ్మ రాజశేఖర్ మంచి స్ట్రాటజీ ప్లే చేశాడు. మోనాల్‌కు భవిష్యత్తులో ఎప్పుడైనా సాయం చేస్తానని చెప్పి అరియానాకు కెప్టెన్‌గా ఎన్నికయ్యేందుకు సాయం చేశాడు. చివరకు అరియానాకు సాయం చేసి తప్పు చేశానని ఘోరంగా తిట్టిపోశాడు.

అమ్మ రాజశేఖర్‌ను వద్దన్నారు..
ఎనిమిదో వారంలో ఎలిమినేషన్ లేకపోయినా చివరకు మెహబూబ్, అమ్మ రాజశేఖర్‌లను భయపెట్టాడు. ఈ ఇద్దరిలో ఎవరికి ఇంట్లో ఉండే అర్హత ఉందనుకుంటున్నారని నాగార్జున అడిగాడు. అరియానా అవినాష్‌లు అమ్మ రాజశేఖర్ పేరు చెప్పారు. మిగతా వారంతా మెహబూబ్ ఉండాలని అమ్మ రాజశేఖర్‌ను పంపించాలనే చెప్పారు.

మోనాల్‌పై ఫైర్..
కానీ ఎలిమినేషన్ లేదని చెప్పి అమ్మ రాజశేఖర్, ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చాడు. అమ్మ రాజశేఖర్ మాత్రం తనకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన వారిని మనసులో పెట్టుకున్నాడు. అరియానా అవినాష్‌లతో తప్పా మిగతా వారితో అంత క్లోజ్‌గా ఉండటం లేదు. మోనాల్‌ను కూడా ఓ రేంజ్‌లో తిట్టేశాడు.

అదొక్క సాయం చేయ్..
మోనాల్ తనకు వ్యతిరేకంగా చెప్పడంతో అమ్మ రాజశేఖర్ దాన్ని జీర్ణించుకోలేకపోయాడు. జీవితంలో మాట్లాడకు అదొక్క సాయం చేయ్ చాలు అంటూ మోనాల్‌తో దారుణంగా మాట్లాడాడు. అమ్మాయిలందరూ అంతే అంటూ మోనాల్‌ను తిట్టిపోశాడు. ఇక ఎప్పుడూ మాట్లాడకు అంటూ దూరంపెట్టేశాడు.

నీకు సాయంగా ఉంటాను..
తాజాగా అమ్మ రాజశేఖర్ మోనాల్‌తో సాయంగా ఉంటానని చెప్పాడు. మొన్ననేమో మాట్లాడొద్దని చెప్పాడు.. ఈ రోజేమో సాయంగా ఉంటానని చెప్పాడు.. మరి రేపు ఏం చేస్తాడో చూడాలి. అఖిల్, సోహెల్ మోనాల్‌ను నామినేట్ చేయడంతో అమ్మ రాజశేఖర్ షాక్ అయ్యాడు. అలా అందరూ మోనాల్‌ను ఒంటరి చేయడంతో అమ్మ రాజశేఖర్ సాయంగా ఉంటానని చెప్పాడు. మొత్తానికి మోనాల్ అమ్మ రాజశేఖర్ కాంపౌండ్‌లోకి వచ్చినట్టు కనిపిస్తోంది. అమ్మ రాజశేఖర్, అరియానా, అవినాష్, మోనాల్ ఓ జట్టుగా ఉన్నట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











