ఇది మామూలు ఓవర్ యాక్షన్ కాదు.. అసిస్టెంట్‌ అరియానాను ఏకిపారేస్తున్న నెటిజన్స్!

బిగ్ బాస్ ఇంట్లో అమ్మ రాజశేఖర్‌ది ఒకలాంటి క్యారెక్టర్ అయితే.. అరియానా వేరే లెవెల్. చెప్పే దానికి చేసే దానికి పొంతనే ఉండదు. ఇద్దరూ ఇద్దరూ. దివి వెళ్లి పోయిన తరువాత అమ్మ రాజశేఖర్‌కు అరియానా బాగా దగ్గరైంది. ఇప్పుడు ఇంట్లో అమ్మ రాజశేఖర్, మెహబూబ్, అరియానా, అవినాష్ ఒక గ్యాంగ్. వీరిలో సోహెల్ కూడా ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ మధ్య మధ్యలో కాస్త తేడా కొడుతుంది. ఇక అమ్మ రాజశేఖర్ నిన్న కెప్టెన్‌గా గెలిచాడు.

 ఆ టాస్కులో అలా..

ఆ టాస్కులో అలా..

రింగులో రంగు అనే టాస్క్‌లో హారిక, అరియానా, అమ్మ రాజశేఖర్‌లు పాల్గొన్నారు. ఎవరికి ఎక్కువ రంగు అంటకుండా జాగ్రత్త పడతారో వారే విజేతలని చెప్పాడు. కళ్లకు గంతలు, చేతికి గజ్జలు కట్టి ఓ రింగులో పడేశారు. ఇక ఆ టాస్కులో అమ్మ రాజశేఖర్ విజేతగా నిలిచాడు. తొమ్మిదో వారంలో ఇంటి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.

తన వారికి సానుకూలంగా..

తన వారికి సానుకూలంగా..

కెప్టెన్ అయ్యాక అమ్మ రాజశేఖర్ పావులు కదపడం ప్రారంభించినట్టు కనిపించింది. తన వాళ్లకు ఒకలా పని అప్పగించి.. వేరే వాళ్లకు టార్చర్ చూపించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టు అర్థమైంది. అందుకు మెహబూబ్‌తో ముందుగానే అన్నీ చెప్పాడు. మీకు నచ్చిన పనులన్నీ చేసుకోవచ్చని, ఏది కావాలంటే తీసుకోండి.. ఎంజాయ్ చేయండి.. వాళ్ల కోసం వేరే లెవెల్ ప్లాన్ ఉందని మెహబూబ్‌తో అమ్మ రాజశేఖర్ ముచ్చటించాడు.

తక్కువ పని..

తక్కువ పని..

అవినాష్, మెహబూబ్‌లకు కేవలం బాత్రూంలు కడగమని చెప్పాడు. మిగతా వారికి డబుల్ పని అప్పగించాడు. అరియానాకు మాత్రం ఏ పని లేకుండా అసిస్టెంట్‌గా ఉండమని చెప్పాడు. అమ్మ రాజశేఖర్ ఇలా చేయడంతో అందరూ షాక్ అయ్యారు. వారికి అంత తక్కువ పని ఇచ్చారు.. మాకు ఇంత ఇంచారంటూ సోహెల్, అభిజిత్, హారికలు మండిపడ్డారు.

అసిస్టెంట్‌పై జోకులు..

అసిస్టెంట్‌పై జోకులు..

అసిస్టెంట్ ఏంటని మోనాల్ సెటైరికల్‌గా లాస్యతో చెప్పుకొచ్చింది. తనకు ఆ పదవి ఇస్తాడేమో అడుగుతాను అంటూ లాస్య కౌంటర్ వేసింది. అసిస్టెంట్‌‌ను పెట్టుకోవడం, అదెక్కడుందని అభిజిత్, హారిక, అఖిల్, లాస్యలు నవ్వుకున్నారు. మొత్తానికి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజే అమ్మ రాజశేఖర్ ఇళ్లంతా రచ్చ రచ్చ చేసేశాడు. కెప్టెన్‌గా అమ్మ రాజశేఖర్ మరీ ఓవర్ చేస్తున్నాడని నెటిజన్లు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు.

 అప్పుడు అలా..

అప్పుడు అలా..

అసిస్టెంగ్ అంటూ ఏ పని చేయకుండా ఖాళీగా అరియానా ఉండటాన్ని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఏడో వారంలో అభిజిత్‌తో అరియానా అన్న మాటలు మళ్లీ గుర్తు చేస్తున్నారు. నా కెప్టెన్సీలో అందరూ అన్ని పనులు చేయాలి.. ఖాళీగా ఉంటే ఇళ్లు సరిగా ఉండదరు.. అందరూ పని చేయాలి అని చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మాస్టర్ కెప్టెన్సీలో ఎంచక్కా పని లేకుండా ఖాళీగా తిరిగేయడంపై, పని తప్పించుకోవడంపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. చెప్పే మాటలకు చేసే చేష్టలకు ఏ మాత్రం పొంతన లేదు..ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నావని కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X