సింపతీ కోసమేనా అదంతా.. జబర్దస్త్‌పై అవినాష్ సెన్సేషనల్ కామెంట్స్!!
బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడానికి అవినాష్ ఎన్ని అడ్డంకులను దాటాడో అందరికీ తెలిసిందే. అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీపై మొదట ఎన్నో రూమర్స్ వచ్చాయి. చివరకు షోలో తానే ఓపెన్ అయ్యాడు. ఎలా రావాల్సి వచ్చింది.. ఇక్కడ వచ్చేందుకు ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చింది..మళ్లీ షోలో తీసుకోను అని అన్నారంటూ ఇది వరకు చెప్పాడు. అప్పుడు అందరూ జాలీ పడ్డారు. కానీ ప్రతీసారి అదే చెప్పడంతో దాన్ని సింపతీ కార్డ్‌లా వాడటంతో మిస్ ఫైర్ అయ్యేట్టు కనిపిస్తోంది.

నిన్నటి ఎపిసోడ్‌లో..
శనివారం నాటి ఎపిసోడ్‌లో మోనాల్ అవినాష్‌కు నాగార్జున ఓ మంచి ఆఫర్ ఇచ్చాడు. మొహం జాగ్రత్త అనే ఇమ్యూనిటీ టాస్క్‌లో చివరి వరకు మోనాల్ అవినాష్ బాగా కష్టపడ్డారు. అందుకే ఆ ఇద్దరికీ నాగార్జున ఓ అవకాశం ఇచ్చాడు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి వచ్చే వారం ఇమ్యూనిటీ లభిస్తుందని తెలిపాడు.

రెండు బుట్టలు..
అయితే మోనాల్ అవినాష్‌లు ఇందు కోసం మిగతా కంటెస్టెంట్ల సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపాడు. మోనాల్ అవినాష్ తమ బుట్టల్లో ఎక్కువ వస్తువులు వచ్చేలా, బరువు పెరిగేలా చూసుకోవాలి. అందుకోసం ఇంటి సభ్యులను వస్తువులు దానం చేయమని కోరాలి. బుట్టలో వేసినవి ఎప్పటికీ తిరిగి రావని తెలిపాడు.

సింపతీ కార్డ్..
అవినాష్ ప్రతీ ఇంటి సభ్యుడి దగ్గరకు వెళ్లి తన కష్టాల చిట్టాను విప్పాడు. ఆ షో వాళ్లు మళ్లీ తీసుకోనని అన్నారు.. ఇక్కడి నుంచి బయటకు వెళ్లాక నా లైఫ్ ప్రశ్నార్థం.. ఇంటి ఈఎంఐలు కట్టాలి.. ఇంట్లో వాళ్లందర్నీ చూసుకోవాలి నాకు సపోర్ట్ చేయండని వేడుకున్నాడు. తన కష్టాలను చెప్పి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించాడు.

జబర్దస్తో షోపై కామెంట్స్..
తన ఆట ఏదో తాను ఆడకుండా ప్రతీసారి ఆ షో గురించి మాట్లాడటం, తన కష్టాల గురించి చెప్పడంతో అవినాష్ గ్రాఫ్ పడిపోతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇది అతనిపై నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‌లో అయితే ఇమ్యూనిటీ సాధించేశాడు.


Click it and Unblock the Notifications











