రెచ్చగొట్టడంతో కనిపెట్టేశాడు.. అఖిల్‌పై అనుమానపడ్డ అవినాష్
బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లు కొన్నింటిని ముందే ఊహిస్తారు. తమ ఇంటి సభ్యులు ఎందుకు అలా ప్రవర్తిస్తుంటారని అంచనాలు వేస్తుంటారు. మరీ ముఖ్యంగా టాస్కుల విషయానికి వచ్చే సరికి అందరూ జాగ్రత్త పడుతుంటారు. ఈ నాల్గో సీజన్‌లో సీక్రెట్ టాస్క్‌లు ఎక్కువగా రాలేదు. మొదటి సారి హోటల్ టాస్కులో అవినాష్‌కు సీక్రెట్ టాస్క్ వచ్చింది. అవినాష్ ఎంత చెడగొడుతున్నా ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు.
ఆ సీక్రెట్ టాస్క్ అనుభవం నిన్నటి పల్లెకు పోదాం చలో చలో టాస్కులో పనికి వచ్చింది. రెచ్చిగొట్టి కోపం వచ్చేలా చేయాల్సి ఉంటుందని అందుకే తనను ఇంతలా బ్యాడ్ చేస్తున్నారు రెచ్చగొడుతున్నారని అవినాష్ చెప్పేశాడు. హారిక, అఖిల్ ఇద్దరూ కూడా పాన్ షాప్ వద్ద గొడవ పెట్టడం, ఆ కోపంలో అవినాష్ తన పాన్ షాప్ ఎత్తి అవతల పారేయడం అన్నీ జరిగిపోయాయి. ఆ తరువాత అవినాష్‌కు అసలు కథ అర్థమైంది.

ఆడండి ఎవరో సీక్రెట్ టాస్కులు ఆడుతున్నారు ఆడండి అంటూ అఖిల్‌ను ఉద్దేశించి అన్నాడు. హారికపై అవినాష్‌కు అంతగా అనుమానం రాలేదు. చివర్లో పంచాయితీ వద్ద కూడా హారిక పేరు చెబుతూ మళ్లీ అఖిల్ పేరు చెప్పేశాడు. ఎందుకంటే ప్రతీ సారి అఖిల్ పాన్ షాప్ వద్ద వచ్చి గొడవలు పెట్టుకునే వాడు. కోపం తెప్పించాలనే టాస్క్ ఇచ్చి ఉండొచ్చు.. అలా కోపం వస్తే ఆ మనిషి చనిపోతాడేమో అంటూ సీక్రెట్ టాస్క్ గుట్టు విప్పాడు.


Click it and Unblock the Notifications











