నీకు ఎలా మాట్లాడాలో కూడా తెలీదు!.. అరియానాపై అవినాష్ సీరియస్
బిగ్ బాస్ షోలో అరియానా అవినాష్ ట్రాక్ కొన్ని వారాలు బాగానే నడచింది. నాగార్జున బాగా ఎంకరేజ్ చేయడంతో అవినాష్ మరింత రెచ్చిపోయాడు. చేసేదంతా చేస్తాడు.. మళ్లీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటూ కలరింగ్ ఇస్తాడు. అయితే అవినాష్ కలిపే పులిహోర అందరికీ తెలిసిందే. అందరిలో కంటే ఎక్కువగా అరియానాతో బాగా కలిపాడు. అరియానా కూడా బాగానే సహకరించింది. ఇద్దరి ట్రాక్ ఫుల్ క్లిక్ అయింది.

అలా బెడిసికొట్టింది..
అవినాష్ అరియానా మధ్య ఏదో ఉందని, వ్యవహారం ఫుల్ స్పీడులో నడుస్తోందని అంతా భావించే సమయంలో అరియానా ఓ బాంబు వేసింది. అవినాష్ కేవలం ఫ్రెండ్ అని చెబుతూ.. వేరే వాటికి వేరే వారున్నారని క్లారిటీ ఇచ్చింది. అలా ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకున్నవారిని తుస్సుమనిపించింది. అప్పటి నుంచి ఈ ట్రాకుపై ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

తాజాగా టాస్క్‌లో..
పల్లెకు పోదాం చలో చలో అనే టాస్కులోనూ బిగ్ బాస్ కావాలనే అవినాష్‌కు ఆ క్యారెక్టర్‌ను ఇచ్చినట్టు కనిపిస్తోంది. అరియానాను ప్రేమించే వ్యక్తిగా మీరు ఉండాలని అవినాష్‌ను ఆదేశించాడు. టాస్కులో ఇక అవినాష్ కూడా రెచ్చిపోయాడు. పెళ్లి చేసుకో అని వెంటపడ్డాడు. ఇంత వరకు అంతా బాగానే నడిచింది. టాస్కు ముగిసిన తరువాత మాటలు పెరిగి ఈ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.

వరెస్ట్ పర్ఫామెన్స్..
ఒకవేళ వరెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన వారు ఎవరని నన్ను అడిగితే నీ పేరు చెబుతాను అంటూ అవినాష్‌తో అరియానా చెప్పుకొచ్చింది. వరెస్ట్ పర్ఫామెన్స్ అని అలా ఎలా అంటావ్ అని అరియానాపై అవినాష్ ఫైర్ అయ్యాడు. అది తన అభిప్రాయం అని, టాస్కులో అంత సీరియస్ అవ్వాల్సిన పని లేదని చెబుతూ అవినాష్‌తో అరియానా వాగ్వాదానికి దిగింది.

నీకు మాట్లాడటమే రాదు..
ఇక ఆ మాటలు విన్న అవినాష్.. అరియానాను ఏకిపారేశాడు. నీకు అసలు మాట్లాడటమే రాదు.. ఎలా మాట్లాడాలో కూడా తెలీదు.. ఒకరి గురించి చెబుతూ ఇంకొకరిని తక్కువ చేస్తావ్.. ఇంతకు ముందు బెస్ట్ పర్ఫామెన్స్ అడిగినప్పుడు నేరుగా నీ పేరు చెప్పుకోకుండా మధ్యలో నా పేరు తీశావ్.. గతవారంలో అమ్మ రాజశేఖర్ పేరు తీశావ్.. నువ్ నన్ను ఈ మధ్య తరుచుగా కించపరుచుతున్నావ్.. నీకు నా గురించి మాట్లాడే హక్కు లేదు.. నువ్ నాత్ మాట్లాడకు అంటూ అరియానాకు గట్టిగా ఇచ్చిపడేశాడు.


Click it and Unblock the Notifications











