కెప్టెన్‌గా అమ్మ రాజశేఖర్ అసలు రంగు బయటపడింది.. తనవాళ్లకు ఒకలా వేరేవాళ్లకు మరోలా!
అధికారం వచ్చాకే మనిషి స్వభావం బయట పడుతుంది. ఒకరి దగ్గర ఒకలా.. ఇంకొకరి దగ్గర మరోలా ప్రవర్తిస్తుంటారు. తన వాళ్లకు ఒకలా.. వేరే వాళ్లకు మరోలా చేస్తుంటారు. అచ్చం అమ్మ రాజశేఖర్ మాదిరిగానే. అమ్మ రాజశేఖర్ కెప్టెన్ అని ప్రకటించిన తరువాత తన గ్యాంగ్ ఫుల్ ఎంజాయ్ చేసింది. ఆ ఊపులో ఉన్న అమ్మ రాజశేఖర్ మెహబూబ్‌తో మంతనాలు జరిపాడు. మీకు ఏ పని కావాలంటే అది చేసుకోండి.. ఎంజాయ్ చేసుకోండి.. వారి కోసం వేరే లెవెల్ ప్లాన్ రెడీగా ఉందని చెప్పాడు.

స్పష్టంగా తెలిసింది..
ఇన్ని రోజులు ఇంట్లో గ్రూపులున్నాయని కనిపించేది. కానీ నిన్నటి అమ్మ రాజశేఖర్ చర్యతో అది స్పష్టమైంది. నోయల్ బయటకు వెళ్లాక అభిజిత్ హారిక లాస్య ఒక్క గ్రూపులా ఉంటున్నారు. మోనాల్‌తో గొడవ వల్ల అఖిల్ కూడా అభి గ్యాంగ్‌లోనే కలిసిపోయాడు. ఇక సోహెల్, మెహబూబ్, అవినాష్, అమ్మ రాజశేఖర్, అరియానా ఒక్క గ్యాంగ్ అని తెలిసిందే.

తన గ్యాంగ్‌కు పని..
కెప్టెన్ అయ్యాక ఎవ్వరూ కూడా తన వాళ్లు పక్క వాళ్లు అని చూడకూడదు. సమానంగా పనిని పంచాలి. కానీ అమ్మ రాజశేఖర్ మాస్టర్ అవినాష్, మెహబూబ్‌లకు సులభమైన పనిని కేటాయించాడు. ఇక అరియానాకు ఎలాంటి పని అప్పగించకుండా తన పక్కనే అసిస్టెంట్‌గా ఉంచుకున్నాడు.

మిగతా అందరిపై కక్ష..
మిగతా అందరిపై కక్ష గట్టినట్టు అన్ని పనులు తోసేశాడు. అఖిల్ అభిజిత్ మోనాల్ లాస్య హారిక సోహెల్‌లకు ఎక్కువ పని అప్పగించాడు. దీంతో వారు వాదించారు. అందులో ముఖ్యంగా హారిక, అభిజిత్, సోహెల్ అమ్మ రాజశేఖర్ నిర్ణయానికి ఎదురుతిరిగారు.

దిగొచ్చిన మాస్టర్..
వ్యవహారం తేడా కొట్టేలా ఉందని అర్థమైన అమ్మ రాజశేఖర్ తన నిర్ణయాలను మార్చుకున్నట్టుంది. మెహబూబ్, అవినాష్‌లకు పనులను సమానంగా కేటాయించాడు. పనులను కేటాయించే సమయంలో మెహబూబ్ డ్యాన్స్ చేయడం, అవినాష్ నవ్వుతూ ఉండటం వల్లే తేడా కొట్టిందని అమ్మ రాజశేఖర్ ఫీల్ అయ్యాడు. ఇదే విషయాన్ని చెబుతూ మెహబూబ్‌పై అరిచేశాడు.


Click it and Unblock the Notifications











