అరవకు నాక్కూడా వాయిస్ వస్తది.. అవినాష్‌ను రెచ్చగొట్టిన హారిక!
బిగ్ బాస్ షోలో లీకులు అన్నది కామన్. అది ఏ విషయమైనా సరే ముందే లీకవుతుంది. మరీ ఈ మధ్య పరిస్థితి ఘోరంగా తయారైంది. ఎలాంటి టాస్కులు ఇవ్వబోతోన్నారు.. కెప్టెన్‌గా ఎవరు ఎన్నిక కాబోతోన్నారనే విషయాలు కూడా లీకవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా పల్లెకు పోదాం ఛలో ఛలో అనే టాస్క్ రిజల్ట్ కూడా లీకైంది. హారిక సీక్రెట్ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేసి కెప్టెన్సీ పోటీకి అర్హత సాధించిందని ముందే సమాచారం వచ్చింది.

సీక్రెట్ టాస్క్..
బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో ఇది రెండో సీక్రెట్ టాస్క్. మొదటిది అవినాష్ విజయవంతంగా పూర్తి చేసేశాడు. ఇక హారిక వంతు ఇప్పుడు వచ్చింది. ఊర్లో పుకార్లు పుట్టించే అమ్మాయిగా హారికకు ఓ పాత్రను ఇస్తూనే ముగ్గురిని హత్య చేయాలనే టాస్క్ ఇచ్చాడు. ఆ ముగ్గురిని ఎలా హత్య చేయాలో కూడా తెలిపాడు.

కాఫీ పోసి..
అమ్మ రాజశేఖర్ మీద కాఫీ పోయాల్సి ఉంటుందని, అలా చేస్తే అమ్మ రాజశేఖర్ హత్యకు గురవుతాడని బిగ్ బాస్ తెలిపాడు. బిగ్ బాస్ చెప్పినట్టుగానే హారిక ఓ హత్య చేసింది. అమ్మ రాజశేఖర్‌పై కాఫీ పోసేసి అమాయకంగా ఏమీ తెలియనట్టు నటించేసింది. అప్పటికీ అమ్మ రాజశేఖర్ అంటూనే ఉన్నాడు.. ఇలా కాఫీ పోయడం కూడా ఏదైనా టాస్కేమో అని. కానీ జాగ్రత్తగా కవర్ చేసేసింది.

రెండో హత్య..
అవినాష్‌కు కోపం తెప్పించాలనే టాస్క్ హారికకు ఇచ్చాడు. అలా అవినాష్‌కు కోపం తెప్పిస్తే రెండో హత్య అయిపోతుందన్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోను చూస్తుంటే అవినాష్‌ను బాగానే రెచ్చగొట్టినట్టు కనిపిస్తోంది. రెండు పాన్లతో మొదలైన ఈ గొడవ మొత్తం పాన్ షాప్‌నే పీకేసే వరకు వచ్చింది.

మధ్యలో అఖిల్..
అయితే ఈ గొడవ ఎవరి మూలానా అయింది.. ఎందుకు అయింది.. అఖిల్ ఎందుకు సీరియస్ అవుతున్నాడు? అనేవి మాత్రం తెలియడం లేదు. ఏది ఏమైనా హారిక మాత్రం అవినాష్ ఫైర్ అయ్యేలా చేసింది. అరవకు అరవకు నాక్కూడా వాయిస్ వస్తది అంటూ మీదమీదకు వెళ్లింది. ఇక మూడో హత్యలో భాగంగా మెహబూబ్ పేరును లిప్ స్టిక్‌లో రాస్తుందేమో చూడాలి. ఈ వారం కెప్టెన్సీ పోటీలో అమ్మ రాజేశేఖర్, హారిక, అరియానా పోటీ పడబోతోన్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











