twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అసిస్టెంట్ పదవి కావాలట.. మోనాల్‌తో లాస్య ఫన్నీ కామెంట్స్

    |

    బిగ్ బాస్ తొమ్మిది వారంలో కొత్త పదవి పుట్టుకొచ్చింది. తొమ్మిదో వారంలో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన అమ్మ రాజశేఖర్ కొంచెం కొత్తగా చేద్దామని ఆలోచించాడు. కానీ అందులో తన వారికి మేలు చేయాలన్న ఉద్దేశ్యం ఉండటంతో మిగతా వారు ఒప్పుకోలేదు. అవినాష్, అరియానా, మెహబూబ్‌లకు పని భారం ఉండకుండా.. ఎంజాయ్ చేసుకునే వీలుగా పనులు కేటాయించాడు. అవినాష్, మెహబూబ్‌లకు కేటాయించిన పనుల పట్ల అందరూ పెదవి విరిచారు.

    అవినాష్ మెహబూబ్‌ల విషయంలో అమ్మ రాజశేఖర్ చేసింది ఒకెత్తు అయితే.. అరియానా విషయంలో చేసింది మరో ఎత్తు. వారం మొత్తం ఎలాంటి పనులు లేకుండా.. కేవలం తనకు అసిస్టెంట్‌గా ఉండటానికి అరియానాను అమ్మ రాజశేఖర్ నియమించుకున్నాడు. ఈ విషయం కాస్త వింతగా ఉన్నా కొత్తేమీ కాదు. ఎందుకంటే గత సీజన్‌లో బాబా భాస్కర్ కూడా శ్రీముఖిని ఇలాగే అసిస్టెంట్‌గా పెట్టుకున్నాడు.

     Bigg boss 4 Telugu week 9 Lasya About Assistant Ariyana With Monal

    ఇలా అరియానాను అసిస్టెంట్‌గా పెట్టుకోవడం పనులేమీ కేటాయించకపోవడంతో అందరూ గుసగుసలు పెట్టుకున్నారు. ఇదేంటి ఇది అన్యాయం కదా.. అసిస్టెంట్ ఏంటి? అని మోనాల్ ధీనంగా లాస్య దగ్గర మొరపెట్టుకుంది. మోనాల్ అంత సీరియస్‌గా చెబుతున్నా కూడా లాస్య మాత్రం తన ధోరణిలో తానే ఉంది. ఆ అసిస్టెంట్ పదవి నాకు ఇస్తారేమో అమ్మ రాజశేఖర్‌ను అడుగుతాను అంటూ సెటైర్ వేసింది. మొత్తానికి అసిస్టెంట్ పదవి మాత్రం ఇంట్లో సెంటరాఫ్ అట్రాక్షన్ అయింది.

    English summary
    Bigg boss 4 Telugu week 9 Lasya About Assistant Ariyana With Monal, Ariyana Assistant To Captain Amma Rajasekhar, Captain Amma Rajasekhar Divided House, Abhijeet Finds Harika Handwriting, Bigg Boss 4 Telugu Week 9 Sohel About Help To His Friend, Bigg Boss 4 Telugu week 9 Bigg Boss Tests Ariyana, Monal And Abhijeet As Pair In Task, Bigg Boss 4 Telugu Harika Did A Mistake in Hygienic Ad, Bigg Boss 4 Telugu week 9 Amma Rajasekhar Harika And Ariyana Wins Task, Bigg Boss 4 Telugu week 9 Secret task To Harika.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X