మెహబూబ్ అలా బుక్కయ్యాడు.. ఆ మాటతో దొరికిపోయాడు!!
బిగ్ బాస్ షోలో మాటలు మార్చడం, ఎదుటి వారిలో తప్పులు ఎంచడం, కానీ తన తప్పును తెలుసుకోలేక పోవడం వంటివి సర్వసాధారణంగా జరుగుతాయి. అలా వేరే వారిపై తప్పులు ఎంచే కంటే ముందు తమ తప్పులు తెలుసుకుని సర్దుకుంటే ఆటలో ముందుకు వెళ్తారు. మెహబూబ్ అరియానా చేసిన తప్పులను ఎత్తిచూపాడు. కానీ అదే తప్పును మెహబూబ్ చేస్తున్నాడని తెలుసుకోలేకపోయాడు.

నిన్నటి టాస్క్..
దీపావళి వస్తోన్న సందర్భంగా వెలిగే దీపం, ఆరిపోయే దీపం ఎవరంటూ ఓ టాస్క్ పెట్టాడు. ఇందులో చాలా మంది సేఫ్ గేమ్ ఆడారు. వెలిగే దీపం అంటూ ఒకరినొకరు ఇచ్చుకున్నారు. లాస్య హారిక, సోహెల్ మెహబూబ్, అనినాష్ అరియానాలు ఒకరినొకరు ఇచ్చుకున్నారు. కానీ ఆరిపోయే దీపం అంటూ చాలా మంది అరియానాకు ఇచ్చారు.

మెహబూబ్ కూడా..
మెహబూబ్ వంతు వచ్చినప్పుడు వెలిగే దీపం సోహెల్‌కు ఇచ్చాడు. అంతకు ముందు సోహెల్ మెహబూబ్‌కు ఇచ్చాడు. అలా బాకీ తీరిపోయింది. ఆరిపోయే దీపం అంటూ అరియానాకు ఇచ్చాడు. దానికి ఓ కారణం కూడా ఇచ్చాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు అరియానా అందరికీ పనులు అప్పగించలేదని, కొందరు కంఫర్ట్‌గా ఉండటం తనకు కావాలని చెప్పిందట. అందుకే అరియానా నచ్చలేదని ఆరిపోయే దీపంగా పేర్కొన్నాడు.

కానీ మెహబూబ్ మాత్రం..
అరియానా ఎలాంటి తప్పు చేసిందని మెహబూబ్ చెప్పాడో.. మెహబూబ్ కూడా అదే తప్పులో భాగస్వామి అయ్యాడు. అమ్మ రాజశేఖర్ కెప్టెన్‌గా ఎన్నికయ్యాక మెహబూబ్‌తో మంతనాలు ఆడాడు. మీకు నచ్చిన పని ఎంచుకోండి.. మీరు ఈజీ పని చేసుకోండి.. మిగతా వాళ్లకు వేరే లెవెల్‌లో ప్లాన్ చేశాను అని మాస్టర్ మెహబూబ్‌తో చెప్పాడు.

పనులు తక్కువగా..
ఇంటి సభ్యులందరికీ పనులు కేటాయించిన సమయంతో అవినాష్, మెహబూబ్‌కు తక్కువ పని అప్పగించాడు. దీనిపై మిగతా వారంతా అరుస్తుంటే.. మెహబూబ్ లేచి డ్యాన్సులు కూడా చేశాడు. ఇక చివరకు ఇంటి సభ్యులు అందరూ వ్యతిరేకించడంతో కొంచెం వేరే పని చేసేందుకు కూడా ఒప్పుకొన్నాడు. అరియానా చేస్తే తప్పు అయినప్పుడు.. అమ్మ రాజశేఖర్ చేసింది కూడా తప్పే అనాలి కానీ మెహబూబ్ సహకరించి తక్కువ పని వస్తుందని ఆశపడ్డాడు. మొత్తానికి మెహబూబ్ నిజస్వరూపం ఇలా బయటపడిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











