బిగ్ బాస్ టాస్క్‌లో ట్విస్ట్.. మళ్లీ అభిజిత్-మోనాల్‌ను కలిపేందుకు ప్లాన్!!
బిగ్ బాస్ ఎప్పుడు ఎవరిని ఎందుకు కలుపుతాడో విడగొడతాడో ఎవ్వరికీ తెలియదు. టాస్కుల్లో ఒక్కోసారి కొంత మందిని కావాలనే విడగొట్టి వ్యతిరేక టీమ్స్‌లో వేస్తుంటాడు. ఇంకోసారి ప్లాన్ కొద్ది ఒక జట్టుగా ఉన్న వాళ్లందరినీ వేరే టీం వేరే టీంలో వేస్తుంటాడు. మొదట అభిజిత్ మోనాల్ కలిసి ఉన్నా కూడా ఏ టాస్క్‌లోనూ ఒకటిగా గానీ, ఒకే టీంలో గానీ వేయలేదు. హారిక అభిజిత్‌లను కూడా అంతే ఇద్దరి మధ్య గొడవలు వచ్చేలా చేస్తాడు.
అభిజిత్ మోనాల్ మధ్య దూరం పెరిగాక ఒకే జట్టులో వేశాడు. బిగ్ బాస్ ఇచ్చిన డీల్ టాస్క్‌లో ఇద్దరిని ఒకే జట్టులో వేశాడు. కానీ అందులో అభిజిత్ మోనాల్‌తో ఎక్కువగా మాట్లాడలేదు. ఇలా ప్రతీసారి బిగ్ బాస్ ఆడించే ఆటలో ఏదో ఒక మలుపు తిరుగుతూనే ఉంటుంది. మొన్నటి నామినేషన్ ప్రక్రియ, ఆ తరువాత ఇచ్చిన మొహం జాగ్రత్త అనే టాస్క్ ద్వారా సమీకరణాలు మారిపోయాయి.

మోనాల్ ఒంటరి అయిపోయింది. అఖిల్ కూడా నామినేట్ చేయడంతో బాగా హర్ట్ అయింది. ఈ సమయంలో అభిజిత్ కాస్త దగ్గరవుతూ మోనాల్‌తో మాట్లాడుతున్నాడు. ఈక్రమంలో పల్లెకు పోదాం చలో చలో అనే టాస్క్‌లో ఈ ఇద్దరినీ ఒకే జట్టుగా వేశాడు. వంటలు తయారు చేసే జంటగా ఈ ఇద్దరికి ఎంతో సమయం మాట్లాడుకునే చాన్స్ ఇచ్చాడు. ఈ టాస్క్ ద్వారా మళ్లీ వీరిద్దరూ దగ్గరవుతారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











