పాపం మోనాల్ పరిస్థితి మరీ దారుణం..అటూ ఇటూ కాకుండా ఏకాకిలా మిగిలింది!!
అన్ని రోజులూ మనవి కావు.. అన్ని రోజులు సంతోషంగానే ఉండవు. కష్టాలు వస్తాయి..ఒంటరిగా ఉండాల్సి వస్తుంది..అది బయటైనా సరే బిగ్ బాస్‌లో అయినా సరే. ఒకప్పుడు బిగ్ బాస్ షో అంటే అభిజిత్ మోనాల్ అఖిల్ ట్రాక్ మాత్రమే చూపిస్తారేమో అనిపించేది. తరువాత మారుతూ మారుతూ వచ్చి అఖిల్ మోనాల్ ట్రాక్ మాత్రం చూపిస్తారేమో ఇక ఈ షో అంతా ఇంతేనా? అని తలలు పట్టుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి.

ట్రయాంగిల్ ట్రాక్..
బిగ్ బాస్ షో ప్రారంభంలోని రెండు మూడు వారాల్లో ఈ ముగ్గురి కథ బాగానే నడిచింది. ట్రయాంగిల్ ట్రాకులో ప్రేమ దేశం సినిమాను చూపించారు. మోనాల్ రెండు పడవలపై ప్రయాణం చేసిందని ఇంటి నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన కంటెస్టెంట్లు చెప్పేవారు. చూసేవారికి కూడా అలాంటి ఫీలింగే కలిగేది. పగలంతా అఖిల్‌తో రాత్రంగా అభిజిత్‌తో మోనాల్ ముచ్చట్లు పెట్టేది.

మధ్యలో అభి దూరం..
మ్యానిపులేటర్ అనే పదం చుట్టూ పెద్ద గొడవే జరిగింది. ఎవరో ఏదో మాట్లాడుతుంటే ఆ విషయాన్ని మోనాల్ అభిజిత్ దగ్గర చెప్పింది. పైగా నామినేషన్‌లో తన పేరు తీయడంపై నాగార్జున అడిగినప్పుడు మోనాల్ మాట మార్చడంతో అభిజిత్ మోనాల్‌కు దూరంగా ఉండిపోయాడు. దాదాపు మూడు వారాలు మోనాల్‌కు దూరంగా ఉండిపోయాడు.

ఈ మధ్య అఖిల్‌తో..
అఖిల్ మోనాల్ కూడా దూరంగా ఉంటారని ఎవ్వరూ ఊహించరు..కానీ అది ఆమె చేసుకున్న స్వయంకృతాపరాధమే. సోహెల్ నోయల్ ఏదో మాట్లాడుకుంటుంటే.. అఖిల్ అడిగాడని ఏదో చెబితే మొత్తం తిరిగి తనమీదే పడింది. మాటలు మార్చి చెప్పడంతో అఖిల్ సోహెల్ మధ్య దూరంపెరిగింది. వీడియోను చూపించి నాగ్.. అఖిల్ మెనాల్ మధ్య దూరాన్ని పెంచేశాడు.

ఒంటరినంటూ..
అఖిల్ మెనాల్‌ని నామినేట్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఒంటరిని అయ్యానని అమ్మ రాజశేఖర్‌తో చెప్పుకుంటూ వాపోయింది. పెదరాయుడి రేంజ్‌లో నేను నీకు తోడుగా ఉంటాను అని మోనాల్‌కు అమ్మ రాజశేఖర్ భరోసా ఇచ్చాడు. కానీ అమ్మ రాజశేఖర్ మాత్రం తన గ్యాంగ్‌తోనే ఉంటున్నాడు.

రెండు గ్యాంగ్‌లు..
అభిజిత్, హారిక, లాస్య, అఖిల్ ఓ గ్యాంగ్‌లా ఉంటున్నారు. ఇందులో మోనాల్ చేరదు.. చేరలేదు.. అటు వైపు అమ్మ రాజశేఖర్, అవినాష్, అరియానా, మెహబూబ్ ఉన్నారు. అందులోనూ ఇమడ లేకపోతోంది. అవినాష్ ఏదో టైంపాస్‌కు మోనాల్‌తో కామెడీ చేస్తాడు. అంతే కానీ సీరియస్ ఫ్రెండ్ షిప్ అయితే కనిపించలేదు. ఒకప్పుడు షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉన్న మోనాల్ ఇప్పుడు ఏ మూల ఉందో కూడా కనిపించడం లేదు. మొత్తానికి మోనాల్ ఇంట్లో ఏకాకిలా అయిపోయింది.


Click it and Unblock the Notifications











