నా నిర్ణయం ఎప్పుడూ తప్పే.. సరిగా జడ్జ్ చేయలేను.. అఖిల్ విషయంలో మోనాల్ హర్ట్!!
బిగ్ బాస్ షోలో తొమ్మిదో వారం పెద్ద గొడవలే జరిగాయి. ఒక్క ఎపిసోడ్‌లో జరగాల్సిన నామినేషన్స్ ప్రక్రియ రెండు ఎపిసోడ్‌లకు చేరింది. అంటే అక్కడ ఎంత పెద్ద రచ్చ జరిగి ఉంటుంది.. ఎంత మంది ఎంతలా వాగ్వాదానికి దిగి ఉంటారో అర్థం చేసుకోండి. ఏ ఒక్కరూ కూడా తగ్గలేదు. ఒకరిని మించి మరొకరు రెచ్చిపోయారు. అసలు ఈ లాంటి నామినేషన్స్ ప్రకియ ఒకటి జరుగుతుందని ఎవ్వరూ కూడా ఊహించి ఉండరు. రోజులు గడుస్తున్న కొద్దీ.. మనుషులు తగ్గుతున్న కొద్ది నామినేషన్స్ ప్రక్రియ మరింత కఠినమవుతోంది.

తొమ్మిదో వారంలో అలా..
తొమ్మిదో వారానికి గానూ బిగ్ బాస్ వెరైటీగా నామినేషన్ ప్రక్రియను చేపట్టాడు. ఓ సమయం అంటూ పెట్టకుండా తాను పిలిచిన కంటెస్టెంట్.. తగిన కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేస్తూ తలపై కోడి గుడ్డు కొట్టాల్సి ఉంటుందని తెలిపాడు. ఇలా బిగ్ బాస్ ఎవరిని ఎప్పుడు పిలుస్తారో అంటూ కంటెస్టెంట్లు ఎదురుచూశారు. అందరి నామినేషన్లు అయ్యాయి. కానీ అందరూ ఒక్క విషయంలో షాక్ అయ్యారు.

మోనాల్‌పై అఖిల్..
ఎనిమిదో వారంలో మోనాల్ అఖిల్ మధ్య కాస్త దూరం పెరిగింది. అదికూడా సోహెల్ నోయల్‌తో చెప్పిన మాటలు మార్చి చెప్పడం, ఆ విషయాన్ని నాగార్జున వీడియో వేసి చూపించడంతో గుట్టు రట్టైంది. మోనాల్ గురించి నిజాలు తెలుసుకున్న అఖిల్ ఈ తొమ్మిదో వారంలో నామినేట్ చేశాడు. కానీ కారణాలు మాత్రం ఏవేవో చెప్పాడు.

అసలు కారణం తెలుసు..
మోనాల్‌ను అఖిల్ నామినేట్ చేయడంతో ఇంట్లో వారందరూ షాక్ అయ్యారు. మోనాల్ వచ్చి అమ్మ రాజశేఖర్‌తో ముచ్చట్లు పెడుతూ కన్నీరు పెట్టుకుంది. వాడేంటి నిన్ను నామినేట్ చేశాడు.. అంటూ మోనాల్‌ను ఇంకా రెచ్చగొట్టాడు. అవి కారణాలు కాదు.. అసలు కారణం వేరే ఉంది.. నాకు తెలసు అంటూ మోనాల్ తన బాధను బయటపెట్టేసింది.

ఎక్కువ కావాలి..
అమ్మాయి అబ్బాయి అంటే ఫ్రెండ్షిప్ కాదు ఇంకా ఏదో కావాలి అనుకుంటారు..అది లేదు కదా.. అదే ప్రాబ్లమ్ అంటూ అమ్మ రాజశేఖర్‌తో అఖిల్ గురించి మోనాల్ చెప్పుకొచ్చింది. ముందు నుంచి నేను మనుషులను అంతగా జడ్జ్ చేయలేను.. మనుషులను జడ్జ్ చేయడంలో నా నిర్ణయం ప్రతీసారి తప్పవుతోందని మోనాల్ బాధపడింది.

చివరకు ఒంటరిని
ఈ ఇంట్లో ఇప్పుడు నేను ఒంటరినయ్యాను అని అమ్మ రాజశేఖర్‌కు చెప్పుకుంటూ వాపోయింది. మీరు, అరియానా, అవినాష్ ఓ గ్యాంగ్.. అభిజిత్, హారిక, లాస్య, ఓ గ్యాంగ్ ఇప్పుడు అఖిల్ కూడా చేరిపోయాడు.. అఖిల్ ఇంకా సోహెల్, మెహబూబ్‌లతోకూడా క్లోజ్‌గా ఉంటాడు..చివరకు నేను ఒంటరిని అయ్యాను అంటూ మోనాల్ ఏడ్చేసింది.


Click it and Unblock the Notifications











