అరియానాకు నాగార్జున పంచ్.. దెబ్బకు నోర్మూసింది!!
బిగ్ బాస్ షోలో ఇప్పటి వరకు ఎనిమిది వారాలు పూర్తయ్యాయి. తొమ్మిది వారం కూడా సక్సెస్ ఫుల్‌గా పూర్తి కావొస్తుంది. నేటి సండే ఎపిసోడ్‌లో అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ కానున్నాడని లీకులు వచ్చేశాయి. నేటి సండే స్పెషల్‌ను ఫండే చేసేందుకు యాంకర్ సుమను స్పెషల్ గెస్ట్‌గా పిలిచాడు. చూసే ప్రేక్షకులను బక్రాలను చేసేందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ చెబుతున్నారు. అయితే ఇది కాసేపు పక్కనపెడితే శనివారం నాటి ఎపిసోడ్‌లో కొన్ని హైలెట్స్ జరిగాయి. మొదటిసారిగా నాగార్జున ఇంటి సభ్యులకు కౌంటర్ వేశాడు.

మొహం జాగ్రత్త టాస్క్..
తొమ్మిదో వారంలో నామినేట్ అయిన ఐదుగురు సభ్యులకు బిగ్ బాస్ ఓ ఆఫర్ ఇచ్చాడు. మొహం జాగ్రత్త అనే టాస్కులో చివరి వరకు ఎవరు నిలబడి గెలుస్తారో వారికి ఇమ్యూనిటీ లభిస్తుందని తెలిపాడు. ఆ టాస్క్‌లో అరియానా కాస్త ఓవర్‌గానే చేసింది. బిగ్ బాస్ ఆడమన్నాడు కదా అని ఆడటం కాదు.. కొంచెం దయ, మానవత్వం లాంటివి కూడా చూపించాలి. అసలే మన ప్రేక్షకులు ఎమోషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.

ఐస్ వాటర్, క్యూబ్స్‌తో..
టీ స్టాండ్‌పై మొహం పెట్టుకుని నిల్చున్న కంటెస్టెంట్లన డిస్టర్బ్ చేసే క్రమంలో అరియానా హద్దులు దాటింది. మిగతా కంటెస్టెంట్లు వద్దని వారిస్తున్నా వినిపించుకోలేదు. ఏదో తనంతట తాను ఆడాలి, ఏదో కొత్తగా చేయాలనే తపన ఉన్నదానిలా ఆడింది. బిగ్ బాస్ పంపిన ఐస్ వాటర్, క్యూబ్స్‌తో మొహాలపై దాడి చేయడం ప్రారంభించింది.

సోహెల్ అరియానా మధ్య యుద్దం..
అలా వాటర్‌ను, క్యూబ్స్‌ను కంటెస్టెంట్ల విసురుతుంటే అందరి మీదా పడుతున్నాయని వాటిని తన్ని అవతల పారేశాడు. ఈ విషయంలో అరియానా సోహెల్ మధ్య మాటల యుద్దం జరిగింది. ఇదే విషయాన్ని నాగార్జున లేవనెత్తాడు. సోహెల్ అరియానా వాదనలను విన్నాడు. చివరకు నాగార్జున అరియానాకు గట్టిగా ఇచ్చాడు.

బిగ్ బాసే ఇచ్చాడు..
ఇసుక, గడ్డి ఇలా ఎన్నో ఉన్నాయి.. కానీ ఆ ఐస్ వాటర్, క్యూబ్స్ మొహాన కొట్టకు అని చెప్పాను అంటూ సోహెల్ తన వాదనను వినిపించాడు. ఆ ఐస్ వాటర్, క్యూబ్స్ నేను తీసుకొచ్చానా? బిగ్ బాస్ ఇచ్చాడు నేను ఆడాను.. నేను కేవలం ఆటే ఆడాను అంటూ అరియానా తన పాయింట్‌ను బయట పెట్టింది. కానీ మానవత్వం అనేది ఒకటి ఉంటుంది కదా అని సోహెల్ మాట్లాడాడు.

పూలు, కత్తి..
వారి ఆరోగ్యం అసలే బాగా లేదు.. వాటర్ వద్దు మిగతావన్నీ వాడొచ్చని చెప్పినా వినలేదంటూ అరియానాపై సోహెల్ ఫిర్యాదు చేశాడు. బిగ్ బాస్ పంపిన వాటితోనే ఆడాను.. వారంటే నాకు ప్రత్యేకించి పగ, కక్షలాంటివి లేవని అరియానా తెలిపింది. బిగ్ బాస్ పూలు పంపుతాడు.. కత్తి పంపుతాడు.. దేంతో ఆడాలి, ఎలా ఆడాలి మీరే నిర్ణయించుకోవాలి అంటూ అరియానాకు పరోక్షంగా పంచ్ వేశాడు. నాగార్జున అలా అనడంతో అందరూ క్లాప్స్ కొట్టారు. అరియానా నోర్మూసుకుంది.


Click it and Unblock the Notifications











