హారికకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన బిగ్‌బాస్.. అవకాశాన్ని వాడుకుంటుందా?

బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో ఫిజికల్ టాస్కులో ఆలస్యంగా మొదలయ్యాయి. మొదటి రెండు మూడు వారాలు చప్ప చప్పగా సాగిన షో మెల్లిమెల్లిగా పుంజుకుంది. నాలుగు ఐదు వారాల్లో అసలైన ఫిజికల్ టాస్కులు వచ్చాయి. అయితే ఎనిమిది వారాల్లో జరిగిన టాస్కులో ఒక్క సీక్రెట్ టాస్క్ మాత్రమే వచ్చింది. అది కూడా అవినాష్‌కు రావడంతో దాన్ని అదరగొట్టేశాడు. ఏ ఒక్కరికీ అనుమానం రాకుండా తన ప్లాన్స్‌ను ముందుకు కదిలి సక్సెస్ అయ్యాడు.

బిగ్ బాస్ హోటల్ టాస్క్‌లో..

బిగ్ బాస్ హోటల్ టాస్క్‌లో..

బిగ్ బాస్ ఇచ్చిన హోటల్ టాస్క్‌లో అవినాష్‌కు ఓ సీక్రెట్ టాస్క్ వచ్చింది. హోటల్ స్టాఫ్‌లో ఉంటూనే వారి పనులను చెడగొట్టాలని, కనీసం పది సేవలను చెడగొట్టాలని తెలిపాడు. అయితే ఎవ్వరికీ అనుమానం రాకుండా అవినాష్ వాటిని పూర్తి చేసేసి సక్సెస్ అయ్యాడు. అలా మొదటి సీక్రెట్ టాస్క్ విజయవంతమైంది.

రెండో సీక్రెట్ టాస్క్..

రెండో సీక్రెట్ టాస్క్..

అయితే నేటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ మరో టాస్క్‌లో ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. అది కూడా హారికకు ఇచ్చాడు. దీంతో హారిక ఫుల్ ఎగ్జైట్ అయింది. ఇంతకీ టాస్క్ ఏంటంటే.. పల్లెకు పోదాం చలో చలో అంటూ రంగస్థలం అనే ఊరిగా మార్చేశాడు. ఆ ఊరి పెద్దగా సోహెల్, అతని భార్యగా లాస్య నటించనుంది. ఊరి పెద్ద భార్యను పడగొట్టేందుకు ప్రయత్నించే పాత్రలో అమ్మ రాజశేఖర్ కనిపించనున్నాడు.

ఇందులో ఓ హత్య..

ఇందులో ఓ హత్య..

హారికకు సీక్రెట్ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్.. మెహబూబ్‌ను విలన్‌ను చేసేశాడు. దాంతో బిగ్ బాస్ ఊర్లో గొడవలు జరిగాయి. అలా గొడవలు జరుగుతున్న క్రమంలోనే ఊర్లో ఓ హత్య జరిగిందని అందరికీ షాక్ ఇచ్చాడు. ఎవరిని నమ్మాలో తెలియడం లేదంటూ అమ్మ రాజశేఖర్ తన బిజీలో తాను ఉన్నాడు.

రచ్చ రచ్చ అయ్యేట్టుంది..

రచ్చ రచ్చ అయ్యేట్టుంది..

బిగ్ బాస్ తొమ్మిదో వారంలో ఈ టాస్క్ పెద్ద చిచ్చు పెట్టేలానే కనిపిస్తోంది. హారిక, మెహబూబ్‌లతో టాస్క్ మలుపు తిరిగేలా ఉంది. మొత్తానికి ఈ టాస్క్‌లోనూ అవినాష్ తనదైన శైలిలో నవ్విస్తూ మోనాల్, అరియానాతో పులిహోర కలిపేస్తున్నాడు. ఈ టాస్క్‌లో ఎవరు బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తారో చూడాలి. హారికకు వచ్చిన మంచి అవకాశాన్ని వినియోగించుకుంటుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X