హాస్పిటల్‌లో ఫ్రెండ్ భార్యకు సీరియస్.. అప్పుడు 15 వేలు కూడా లేవు.. టచ్ చేసిన సోహెల్
బిగ్ బాస్ షోలో అప్పుడప్పుడు కొన్ని ఎమోషనల్ సీన్స్ బయటకు వస్తాయి. ఇంకొన్ని మంచి సందేశాలు ఇచ్చే స్టోరీలు బయటకు వస్తాయి. నిన్నటి ఒప్పో టాస్క్‌లో సోహెల్, లాస్యలు చెప్పిన ఘటనలు అందర్నీ టచ్ చేశాయి. ముఖ్యంగా సోహెల్ తన కథను చెబుతూ అందరికీ ఓ ఎమోషనల్ మెసెజ్‌ను ఇచ్చాడు. మనం మంచి చేయడానికి ముందుకు వస్తే.. సమాజం కూడా మనతో కలిసి ముందుకు వస్తుందని అంటూ మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఇంతకీ ఆ టాస్క్ ఏంటి? ఆ టాస్క్‌లో సోహెల్ చెప్పిందేంటో ఓ సారి చూద్దాం.

జీవితంలో వెలుగు..
బీ ది లైట్ ఫర్ అదర్స్ లైఫ్ అంటూ క్యాప్షన్‌తో ఓ టాస్క్ ఇచ్చాడు. ఒప్పో ఫోన్‌లకు సంబంధించిన ఈ ప్రకటనలో ఇంటి సభ్యులందరూ తమ జీవితంలో ఎదుటి వారికి సాయం చేసిన ఘటనలు, తమకు ఎవరైనా సాయం చేసిన ఘటనలను చెప్పమన్నాడు. మీరు ఎదుటి వారి జీవితంలో వెలుగులు నింపిన ఘటనలు చెప్పాల్సి ఉంటుంది.. ఎవరైతే అత్యుత్తమ ఘటన చెబితే వారికి ఒప్పో ఫోన్ బహుమతిగా లభిస్తుందని తెలిపాడు.

అర్దరాత్రి ఫోన్..
నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు. అతని భార్య గర్భవతి. అది ఏడో నెల. అయితే తొమ్మిదో నెలలో బిడ్డ పుడుతుంది కదా అని అప్పటి వరకు డబ్బులు సర్దుకుందామని అనుకున్నాడు. కానీ ఏడో నెలలో బిడ్డ పుట్టింది. అలా ప్రీ మెచ్యుర్డ్ పాప పుట్టింది. అయితే అలా సడెన్‌గా అవ్వడంతో వాడి దగ్గర డబ్బులు లేవు. నాకు అర్ధరాత్రి ఒంటిగంటకు ఫోన్ చేశాడంటూ సోహెల్ తన కథను చెప్పాడు.

పదిహేను వేలు కూడా..
అలా అర్దరాత్రి ఫోన్ చేసి కంగారు పడ్డాడని సోహెల్ చెప్పుకొచ్చాడు. ఇలా జరిగిందని చెబుతూ బాధ పడ్డాడు. డబ్బుల్లేవురా అని అడిగాడు. ఓ పదిహేను వేలు కావాలిరా అన్నాడు. కానీ అప్పుడు నా దగ్గర అవి కూడా లేవు. నేను ఇంటికి ఫోన్ చేసి తమ్ముడి ద్వారా ఆ డబ్బులు తీసుకున్నాను. నా ఫ్రెండ్‌కి ఇచ్చానని సోహెల్ పేర్కొన్నాడు.

పదిలక్షలు అడిగారు..
అయితే ఆస్పత్రిలో ఉన్న వాడి భార్యకు ఇంకా సీరియస్ అవ్వడంతో పది లక్షలు అవుతాయని చెప్పారు. ఇక వాడు చాలా బాధపడ్డాడు. అప్పటికే రెండు సార్లు గర్భస్రావం జరిగింది. ఈ సారి ఎలాగైనా పాపను కాపాడుకోవాలి అని కన్నీరు పెట్టుకున్నాడు. నా దగ్గర కూడా అంత లేవు. నాకు సోషల్ మీడియా, సమాజం మీద నమ్మకం అందుకే ఇలా జరిగింది అవసరం ఉందని పోస్ట్ పెట్టాను అని సోహెల్ వెల్లడించాడు.

మూడు నాలుగు రోజుల్లోనే..
అలా పోస్ట్ పెట్టిన మూడు నాలుగు రోజుల్లో దాదాపు నాలుగున్నర లక్షలు వచ్చాయి. ఆ తరువాత మొత్తం డబ్బు సమకూరింది. నేను బిగ్ బాస్‌కు వచ్చే పది రోజుల ముందే అంతా అయిపోయింది. వాడి పాపను చూసుకుని నా ఫ్రెండ్ మురిసిపోయాడు. ‘ఈ సమాజానికి, నీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను.. ఏదో ఒకటి చేస్తాను' అని నా ఫ్రెండ్ ఎమోషనల్ అయ్యాడని సోహెల్ చెప్పాడు. మనం మంచి చేస్తే కచ్చితంగా మనతో పాటు సమాజం కూడా ముందుకు నడుస్తుందని మరోసారి చెప్పినందుకు థ్యాంక్స్ అని అందర్నీ సోహెల్ టచ్ చేశాడు.


Click it and Unblock the Notifications











