మళ్లీ దూరమైన స్నేహబంధం.. సోహెల్‌ను పట్టించుకోని అఖిల్.. టాస్క్ కోసమేనా?
బిగ్ బాస్ షోలో అఖిల్ సోహెల్ మెహబూబ్ మంచి స్నేహితులుగా మారారు. ఎవరు తప్పు చేసినా సరే మిగతా వారు సర్దిచెప్తారు. తప్పును సరిదిద్దుతారు. కానీ టాస్కులు వచ్చే సరికి ఎవరి ఆట వారు ఆడతారు. మధ్యలో సపోర్ట్ చేసుకున్నా కూడా ఎవరి ఆట వారే ఆడతారు. టాస్కులో ఒకరిపై ఒకరు విరుచుకుపడతారు. మళ్లీ వాటిని మరిచిపోయి ఒకటిగా కలుస్తారు. అయితే ఈ తొమ్మిదో వారంలో మాత్రం ఈ ముగ్గురి మధ్య దూరం పెరిగినట్టే కనిపిస్తోంది.

నామినేషన్స్‌లో అలా..
తొమ్మిది వారం నామినేషన్ ప్రక్రియ కూడా వింతగా జరిగింది. బిగ్ బాస్ తనకు నచ్చిన సమయంలో నచ్చిన కంటెస్టెంట్ పేరు చెప్పి నామినేట్ చేయమని తెలిపాడు. కోడి గుడ్డు కొట్టి తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాలని తెలిపాడు. తొమ్మిది వారంలో మొత్తంగా అమ్మ రాజశేఖర్, అవినాష్, అభిజిత్, హారిక, మోనాల్ నామినేట్ అయ్యారు. ఇందులో ఒకరు సేవ్ అయ్యేందుకు బిగ్ బాస్ మరో టాస్క్ పెట్టాడు.

మొహం జాగ్రత్త..
మొహం జాగ్రత్త టాస్క్‌లో నామినేట్ అయిన సభ్యులందరూ తమ మొహాలను టీ స్టాండ్‌పై ఉంచాలి. వారిని కదిలించేందుకు మిగతా సభ్యులు నీళ్లు, ఇసుక, గడ్డి, గుడ్లు వంటి వాటితో దాడి చేయవచ్చని తెలిపాడు. ఇందులో అమ్మ రాజశేఖర్‌ను అఖిల్ టార్గెట్ చేశాడు. అమ్మ రాజశేఖర్‌కు మద్దతుగా మెహబూబ్ నిలిచాడు. అలా ఈ ఇద్దరి మధ్య వచ్చిన గొడవ పెరిగింది. మోనాల్ కంట్లో ఇసుక పోవడంతో అఖిల్ తుడిచాడు. ఈ విషయంలో సోహెల్ ఎంట్రీ ఇచ్చి మెహబూబ్‌ను అన్నావ్ మళ్లీ నువ్ చేస్తున్నావ్ అంటూ అఖిల్‌తో గొడవ పెట్టుకున్నాడు.

ఏంది బే అంటూ..
ఇలా సోహెల్ అఖిల్ మధ్య మాటామాట పెరిగి ఏంది బే అనేవరకు వచ్చింది. బే అని అనకు అంటూ అఖిల్ మీదకు సోహెల్ వచ్చాడు. కొడతావా? అంటూ అఖిల్ కూడా సోహెల్ మీదకు వెళ్లాడు. ఇలా ఈ ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఆ తరువాత అఖిల్ తాను టాస్క్ ఆడనని కూర్చుంటే సోహెల్ వచ్చి బతిమిలాడాడు. కానీ వినలేదు. మళ్లీ నిన్నటి టాస్క్‌లోనే అదే కథ రిపీట్ అయింది.

నిన్నటి టాస్క్‌లోనూ..
పల్లెకు పోదాం చలో చలో అనే ఈ టాస్క్‌లోనూ అఖిల్ సోహెల్‌కు దూరంగానే ఉంటున్నాడు. అయితే టాస్క్‌లో కూడా అలానే ఉంది. సోహెల్‌ను ఎదురించాలి.. మాట వినకూడదు.. నిర్ణయాలను వ్యతిరేకించాలి.. బాధ్యత లేని గ్రామస్థుడి పాత్రలో అఖిల్ ఉండటంతో సోహెల్‌తో దూరంగా ఉంటున్నాడో మరి మొహం జాగ్రత్త టాస్కులో జరిగిన గొడవతో దూరంగా ఉంటున్నాడో చూడాలి. సోహెల్ వచ్చి శాంతంగా మాట్లాడినా కూడా అఖిల్ పట్టించుకోవడం లేదు. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య అయితే మళ్లీ దూరం పెరిగినట్టే కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











