Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సోహెల్ కాళ్లు మొక్కిన అవినాష్.. కథ వేరేలా ఉందే!
బిగ్ బాస్ షోలో తొమ్మిదో వారంలో అతి ముఖ్యమైన ఘట్టం ముగిసింది. నామినేషన్ ప్రక్రియ ఎంతో రసవత్తరంగా సాగింది. నామినేషన్ ప్రక్రియలో కోడి గుడ్లు బాగానే పగిలాయి. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఒక్కొక్కొరు తమ మనసులో ఉన్నదంతా కక్కేశారు. ఒకరిపై ఒకరు మాటలతో విరుచుకపడ్డారు. మొత్తానికి తొమ్మిదో వారంలో అవినాష్, అమ్మ రాజశేశేఖర్, అభిజిత్, హారిక, మోనాల్ నామినేట్ అయ్యారు.
ఒక్క చాన్స్ ఇచ్చాడు..
నామినేట్ అయిన ఐదుగురిలో ఒక్కరు సేవ్ అయ్యే చాన్స్ బిగ్ బాస్ ఇచ్చాడు. కానీ దానికోసం ఓ టాస్క్ చేయాల్సి ఉంటుందన్నాడు. మొహం జాగ్రత్త అంటూ టాస్క్ ఇచ్చాడు. చివరి వరకు టీ స్టాండ్ మీద మొహం కదల్చకుండా ఉండాలి అలా ఒక్కరే మిగలాలి అని టాస్క్ ఇచ్చాడు. ఒక్కరి కంటే ఎక్కువ మంది ఉంటే ఎవ్వరికీ ఇమ్యూనిటీ రాదని తెలిపాడు. అలా ఆ టాస్క్ వృథా అయింది.
టాస్క్ మొదలెట్టాడు..
నామినేషన్ పర్వం పూర్తవ్వడంతో నేటి ఎపిసోడ్‌లొ ఓ టాస్క్ ఇవ్వబోతోన్నాడు. పల్లెకు పోదాం చలో చలో అంటూ రంగస్థలం అనే ఊరిగా మార్చేశాడు. ఆ ఊరి పెద్దగా సోహెల్, అతని భార్యగా లాస్య నటించనుంది. ఊరి పెద్ద భార్యను పడగొట్టేందుకు ప్రయత్నించే పాత్రలో అమ్మ రాజశేఖర్ కనిపించనున్నాడు.
పాన్ షాప్ ఓనర్..
అవినాష్ రంగ పాత్రలో ఈ టాస్క్‌లో పాన్ షాప్ ఓనర్‌గా కనిపించనున్నాడు. ఊరి పెద్ద అయిన సోహెల్ కూతురుగా అరియానా వెంకట లక్ష్మీ పాత్రలో కనిపించనుంది. ఇక అవినాష్ అరియానాతో సరసాలు ఆడటం చూసి సోహెల్ ఫైర్ అయ్యాడు.
కాళ్లు మొక్కిన అవినాష్..
తన కూతురు చేయి పట్టుకోవడంతో ఊరి పెద్ద సీరియస్ అయ్యాడు. ఊరి నుంచి బహిష్కరించేశాడు. చేసిన తప్పుకు శిక్షణగా అవినాష్ ఊరి పెద్ద అయిన సోహెల్ కాళ్లు పట్టుకున్నాడు. మొత్తానికి ఈ టాస్క్లొనూ అవినాష్ ఆల్ రౌండర్‌గా అందర్నీ ఎంటర్టైన్ చేయనున్నట్టు కనిపిస్తోంది.
మెహబూబ్, హారికలు..
మెహబూబ్ హారికను పటాయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. హారిక కోసం స్పెషల్ పాన్ చేశాడట. ఇలా మొత్తానికి ఈ టాస్క్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉండేలా కనిపిస్తోంది. అయితే ఈ ఊర్లో హత్య జరగడంతో కథ అడ్డం తిరిగిలా ఉంది. మరి దాని సంగతేంటో తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.