అభి చూడటం లేదని కంప్లైంట్.. అఖిల్‌తోనే అన్నీ షేరింగ్.. ఎంతైనా మోనాల్ కథ డిఫరెంట్!!
బిగ్‌బాస్ తెలుగు నాల్గో సీజన్‌లో మోనాల్‌ది ఓ డిఫరెంట్ కాన్సెప్ట్. ఆమెకు ముందే స్క్రిప్ట్ ఇచ్చారో లేకా ఇంట్లోకి వచ్చాక ఆట మొదలుపెట్టిందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఓ వైపు అభిజిత్‌తో బాగానే మాట్లాడుతుంది.. మరో వైపు అఖిల్ తన ప్రపంచం అన్నట్టు చెబుతోంది. మాములూగా అయితే అభిజిత్-మోనాల్ మధ్య ట్రాక్ కలుపుదామని బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టున్నాడు. కానీ టమోట పల్ప్ టాస్క్ నుంచి కథ అడ్డం తిరిగింది.

అఖిల్‌తోనే క్లోజ్..
టమోటా పల్ప్ టాస్క్‌లో ఒక్కటైన అఖిల్-మోనాల్ నేటి వరకు కలిసే ఉన్నారు. అయితే అంతకు ముందు నుంచే అభిజిత్‌తో మోనాల్ బాగానే మాట్లాడుతూ ఉంది. పైగా అభి, అఖిల్‌లు కూడా మంచి ఫ్రెండ్స్ లానే ఉన్నారు. ఈ ఇద్దరూ కలిసి మోనాల్ గురించి కూడా మాట్లాడుకున్నారు. సారీ చెప్పేందుకు, మాట్లాడేందుకు ట్రై చేసినా ఆమె మాట్లాడటం లేదని అభి, అఖిల్‌లు ముచ్చటించుకున్నారు.

రోబో టాస్క్‌లో...
రోబో టాస్క్ మూలంగా అభి అంటే మోనాల్‌కు కోపం పెరిగింది. ఆ విషయంలో మొదటగా ద్వేషం, కోపాన్ని ప్రదర్శించింది మోనాల్. దేవీ, నోయల్ చెప్పాక అభితో మాట్లాడటం ప్రారంభించింది. ఆ సమయంలోనే రేషన్ రూం దగ్గర కూర్చుని ఐ లైక్ యూ అని మోనాల్ అభికి చెప్పింది. అయితే కాయిన్స్ టాస్క్‌లో మళ్లీ దూరమయ్యారు.

చూడటం లేదు..
దివి, మోనాల్ మధ్య జరిగిన విషయం కారణంగా అభి దూరంగా ఉంటున్నాడట. అప్పటి నుంచి మోనాల్‌తో మాట్లాడటం లేదని, కనీసం ఐ కాంటాక్ట్ కూడా లేదని మోనాల్ తెగ బాధపడిపోయింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఆ తరువాత దివి అన్న మాటలకు అంత ఎమోషనల్ అవ్వడం, కన్నీరు పెట్టుకోవడం కథ మారింది.

అఖిల్‌తో అన్నీ..
ఇద్దరితో క్లోజ్‌గా ఉంటుంది.. అఖిల్ పడుకున్నాక అభితో మాట్లాడుతుంది.. అభితో మాట్లాడిన తరువాత అఖిల్‌తో ఉంటుందని దివి చేసిన కామెంట్లతో మోనాల్ ఏడ్చింది. తన క్యారెక్టర్‌ను చెడ్డగా చూపిస్తున్నారని చెబుతూ.. ఈ ఇంట్లో తనకు అఖిల్ చాలా క్లోజ్ అని. అన్నీ షేర్ చేసుకుంటానని మోనాల్ చెప్పుకొచ్చింది.
Recommended Video

ఎందుకు అలా..
మోనాల్‌కు అభి ఇష్టమైతే అభితో మాట్లాడాలి.. లేదా అఖిల్ ఇష్టమైతే అఖిల్‌తో మాట్లాడాలి.. లేదా ఆ ఇద్దరూ ఇష్టమైతే.. ముగ్గురు కలిసి కూర్చుని అసలు గొడవలు ఎందుకు వస్తున్నాయ్.. కథ ఏంది.. అని క్లియర్ చేసుకుని ముగ్గురు ఫ్రెండ్స్‌లా ఉండాలి కానీ మోనాల్ మాత్రం డబుల్ గేమ్ ఆడుతూ ఇద్దరినీ తన చుట్టు తిప్పుకుంటోందని ఇట్టే అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications











