twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓహో దాని వెనుక అంత పెద్ద కథ ఉందా?.. ఆ రోజు మోనాల్‌ను చూసి అభిజీత్ అందుకే రియాక్ట్ అవ్వలేదట!

    |

    బిగ్‌బాస్ షోలో కొన్ని ఎందుకు జరుగుతాయో ఎవ్వరికీ అర్థం కావు. అయితే ప్రతీ వాటికి ఓ కారణం ఉండొచ్చు. కానీ వాటిని బిగ్‌బాస్ టీం ప్రతీ ఒక్కరికి చెప్పలేరు కూడా. బిగ్‌బాస్ షో ప్రారంభోత్సవ వేడుకలో అభిజీత్ మోనాల్ మధ్య లింక్ పెట్టేందుకు నాగార్జున ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఓ ఆరుగురు హీరోయిన్ల ఫోటోలను పెట్టి ఓ ఆట ఆడించాడు. అందులో కరెక్ట్‌గా మోనాల్ వద్ద అభిజీత్ లాక్ అయ్యాడు.

    పెళ్లి చేసుకుంటా..

    పెళ్లి చేసుకుంటా..

    మోనాల్, రాశీ ఖన్నా, నభా నటేష్ ముగ్గురి ఫోటోలను చూపించిన నాగ్ అందులో ఎవరిని పెళ్లి చేసుకుంటావ్ అని అడిగాడు. అయితే మోనాల్ కాస్త పద్దతిగా హోమ్లీగా ఉంది ఆమెను పెళ్లి చేసుకుంటా అని అనేశాడు. అయితే అప్పటికి అభిజీత్‌కు మోనాల్ ఓ కంటెస్టెంట్.. తనకంటే ముందు ఇంట్లోకి వెళ్లిందని తెలియదు.

    అంతా ఆసక్తిగా..

    అంతా ఆసక్తిగా..

    అయితే అభిజీత్ అలా చెప్పడంతో.. ఇంట్లోకి వెళ్లాక మోనాల్‌ను చూస్తే ఎలాంటి రియాక్షన్ ఇస్తాడా? అని అందరూ ఎదురుచూశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. అంతా మామూలుగానే జరిగిపోయింది. ఎలాంటి ఆశ్చర్యం గానీ అనుమానం గానీ ఆనందం గానీ అభిజీత్ మొహంలో కనిపించలేదు.

    నాగ్ కూడా ప్రశ్నించాడు..

    నాగ్ కూడా ప్రశ్నించాడు..

    ఇక ఇదే విషయాన్ని నాగార్జున కూడా లేవనెత్తాడు. మొదటి వీకెండ్‌లో వచ్చిన నాగార్జున అభిజీత్‌ను ఇదే విషయాన్ని అడిగాడు. అయితే మోనాల్‌తో ఆ విషయం డిస్కషన్ చేసేశానని తెలిపాడు. మోనాల్ కూడా అవుననే చెప్పింది. అయితే మోనాల్‌ను చూసిన అభిజీత్ రియాక్ట్ అవ్వకపోవడం వెనుక పెద్ద కథే ఉందట.

    ఫోటోలు తీస్తారట..

    ఫోటోలు తీస్తారట..

    నాగార్జునతో స్టేజ్ మీద మాట్లాడి అక్కడనుండి హౌజ్ లోపలికి వెళ్తున్నప్పుడు ఎంట్రెన్స్‌లో ప్రతీ పార్టిసిపెంట్‌ని ఫోటోగ్రాఫర్స్ స్టిల్స్ తీస్తారట. అలా అభిజిత్ హౌజ్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడున్న ఫోటోగ్రాఫర్స్ అంతక ముందే హౌజ్ లోపలికి ఎంటరైన మోనాల్ ఫోటోస్ చూస్తూ ఆమె గురించి మాట్లాడుతున్నారంట..

     అలా రివీల్..

    అలా రివీల్..


    మొత్తానికి వాళ్ళ డిస్కషన్ ద్వారా ఎంట్రెన్స్‌లోనే మోనాల్ ఉన్న విషయం తెలిసిపోయిందట. అలా సస్పెన్స్ అక్కడే రివీల్ అయ్యేసరికి అభిజీత్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేకుండా పోయింది. అందుకే ఏమీ తెలియనట్టుగానే ఆమెతో కూడా మాట్లాడేశాడు.

    English summary
    Bigg Boss 4 Telugu why Abijeet Not Exited By Seeing Monal On First Day,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X