ఆ విషయంలో అభిజిత్ బక్రా.. ఈ సారి అది వర్కౌట్ కాదేమో!!
బిగ్‌బాస్ ఐదో వారంలో కంటెస్టెంట్లందరికీ మంచి టాస్కే ఇచ్చాడు. బిగ్ బాస్ హోటల్ అంటూ అది ధీనావస్థలో ఉంది.. వచ్చిన గెస్ట్‌లను జాగ్రత్తగా చూసుకుంటూ...మళ్లీ 5 స్టార్ రేటింగ్ సంపాదించుకోవాల్సి ఉంటుందని తెలిపాడు. లేదంటే బిగ్ బాస్ హోటల్ ధనికుల చేతుల్లోకి వెళ్తుందని పేర్కొన్నాడు. ఇక ఇందులో అవినాష్‌కు ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ హోటల్ టాస్క్‌లో అవినాష్ మాత్రం తన గేమ్‌ను సరిగ్గా ఆడుకుంటున్నాడు. అందరి మధ్య పుల్లలు పెట్టి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు.

అభిజిత్ ప్లాన్..
అయితే ఈ హోటల్ టాస్క్‌లో మేనేజర్‌గా వ్యవహారిస్తున్న అభిజిత్ రేటింగ్‌లను ముందే కొట్టేశాడు.ఇలా రేటింగ్‌లు ఎవరికి వారే పెట్టుకుంటే టాస్క్ ముందుకు సాగేది ఎలా. అయినా సరే రేటింగ్స్‌ను అభిజిత్ కొట్టేసినా కూడా వారి వద్ద ఉన్న డబ్బులను టిప్స్ రూమం మొత్తం లాగేయాలని ఆడుతున్నారు.అయితే ఇందులో హోటల్ టీం ఒకటి మాత్రం మరిచిపోతున్నారు. రేటింగ్స్అనేవి గెస్ట్‌లు సంతృప్తి చెందాకే ఇస్తారు.

మాయ మాటలు చెప్పి..
హారిక నిజాయితీగా తనకు సంబంధించిన స్టార్‌ను ఇస్తానని చెప్పింది. లాస్యకు ఇచ్చిన టాస్క్, చేసిన సేవలకు మెచ్చిన హారిక తన స్టార్‌ను ఇచ్చేసింది. అక్కడే మాటల్లో పెట్టిన అభిజిత్ హారిక వద్దున్న మిగతా స్టార్లను కూడా తీసుకున్నాడు. అలా తీసుకోవడం గేమ్ ప్లాన్, ట్రిక్ అంటున్నాడు. రోబో టాస్క్‌లో తన తెలివి ఉపయోగించాడు పేరొచ్చింది కదా అని మళ్లీ అతి తెలివిని ప్రదర్శించాలని అనుకుంటున్నాడేమో.

అవినాష్‌ను మాత్రం..
అంత తెలివి ఉన్న మేనేజర్ అభిజిత్.. తన సిబ్బందిలోనే మోసం చేసే వ్యక్తి ఒకడున్నాడని అర్థం చేసుకోవడం లేదు. వంటలు రుచి ఉండటం లేదు, హెయిర్, పిన్నులు ఏదో ఒకటి వస్తున్నాయంటే ఎవరో ఏదో చేస్తున్నారు అని మేనేజర్‌గా పసిగట్టాలి, గెస్ట్‌లతో మర్యాదగా మాట్లాడాలి కానీ అవినాష్ అలా రెచ్చిపోతోన్నాకూడా మేనేజర్‌గా అభిజిత్ ఏమీ చేయడం లేదు.
Recommended Video

టాస్క్ మధ్యలోనే..
టాస్క మధ్యలోనే కెప్టెన్సీ గురించి ఆలోచించి అభిజిత్ అభాసు పాలవుతున్నాడు. ప్రతీసారి అంతే నామినేషన్స్ గురించి చర్చిస్తూ ఏదో ఒకటి అంటుంటాడు. ఈ సారి ఇలా టాస్క్ మధల్యోనే అమ్మ రాజశేఖర్‌తో డీల్ కుదుర్చుకున్నాడు. అదంతా వదిలేసి టాస్క్‌పై శ్రద్ద పెడితే బాగా ఆడితే కెప్టెన్సీ వస్తుంది. ఎలాగూ రేటింగ్స్ కొట్టేశాం కదా అని అభిజిత్ రిలాక్స్ అయిపోయాడేమో. అయితే బిగ్ బాస్ మాత్రం ఈ విషయంలో అభిజిత్ చేసింది రైట్ అంటాడా? రాంగ్ అంటాడా?అన్నది చూడాలి. ఇలా రేటింగ్స్ కొట్టేయడంతో అభిజిత్, హారికల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. మరి నేటి టాస్క్‌లో అవి మరింత తారాస్థాయికి చేరేలా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











