Just In
- 23 min ago
2022 సంక్రాంతి ఫైట్: పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో పాటు మరో అగ్ర హీరో
- 1 hr ago
18 నెలల కాపురం.. ప్రెగ్నెన్సీ కూడా.. లాక్డౌన్లో ఆ కారణంగా డిప్రెషన్: నాగార్జున షాకింగ్ కామెంట్స్
- 2 hrs ago
అక్కడి టాటూను పవన్ చూశారు.. ఆఫర్ చేయడంతో రెండు గంటలు: ఆ ఫోటోతో మేటర్ రివీల్ చేసిన అషు రెడ్డి
- 2 hrs ago
ప్రియుడి పేరును బయట పెట్టిన యాంకర్ శ్రీముఖి: తన క్రష్ ఎవరో కూడా రివీల్ చేసిన రాములమ్మ
Don't Miss!
- News
మూడు రాజధానులపై సైలెన్స్- మున్సిపోల్స్‌లో వైసీపీ, టీడీపీ మౌనం- షాకింగ్ రీజన్స్
- Sports
విరాట్ కోహ్లీ ఆధునిక తరానికి హీరో: స్టీవ్ వా
- Automobiles
వాహ్.. కేవలం 18 గంటల్లో 25.54 కిమీ రోడ్డు పూర్తి.. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
- Finance
టెలికం స్పెక్ట్రం వేలం, అంచనాలకు మించి భారీగా బిడ్స్: పోటీలో ఈ కంపెనీలు
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి వ్యాపారులు ఈరోజు ఆర్థిక నష్టాన్ని భరించాలి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టైగర్స్ కోసం బయలుదేరిన బిగ్ బాస్ పులి అభిజిత్.. ట్రావెల్ వీడియోతో సర్ ప్రైజ్
బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా నిలిచిన అభిజిత్ ఒక్కసారిగా తన క్రేబ్ ను పెంచేసుకున్న విషయం తెలిసిందే. గతంలో కంటే ఎక్కువ స్థాయిలో అభిమానుల సంఖ్యను కూడా గట్టిగానే పెంచుకున్నాడు. కేవలం లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ద్వారా వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్ వరకు వెళ్లిన ఈ హీరో విన్నర్ గా నిలుస్తాడాని ఎవరు ఉహీంచలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అతని పేరు వైరల్ అవుతోంది. ఇక రీసెంట్ గా అభిజిత్ ట్రావెల్ డైరీస్ అంటూ ఒక వీడియో రెడీ చేస్తున్నాడు.

ఆఫర్స్ చాలానే వస్తున్నాయట
బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా మంచి క్రేజ్ అందుకున్న అభిజిత్ త్వరలోనే హీరోగా బిజీ కానున్నాడు. ఆఫర్స్ చాలానే వస్తున్నాయట. కానీ తొందరపడకుండా అభిజిత్ కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ ద్వారా విన్నర్ గా నిలిచిన కంటెస్టెంట్ సినీ కెరీర్ లో పెద్దగా సక్సెస్ అయ్యింది లేదు. కానీ అభిజిత్ కు దక్కిన రెస్పాన్స్ మామూలుగా లేదు. కరెక్ట్ గా రెండు సినిమాలు పడితే అతని స్థాయి మరో రేంజ్ కు వెళుతుంది.

యూ ట్యూబ్ ద్వారా..
బిగ్ బాస్ షో ముగిసిన తరువాత కొన్ని రోజుల వరకు అభిజిత్ గ్యాప్ లేకుండా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ ఎలాగైతే యూ ట్యూబ్ ఛానెల్స్ తో ఆడియెన్స్ కు రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారో అలాగే అభిజిత్ కూడా వారానికో వీడియో పోస్ట్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నాడు.

ఫ్రీడమ్ అండ్ పులి కాన్సెప్ట్ లో
ట్రావెలింగ్ అంటే ఎంతగానో ఇష్టపడే అభిజిత్ చాలా రోజుల తరువాత మరొక పీడియోతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. బిగ్ బాస్ ద్వారా అభిజిత్ ఎక్కువగా పులి అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నెటిజన్లు కూడా ఎక్కువగా అతన్ని పులి అనే పిలుస్తున్నారు. ఇక ఆ ట్యాగ్ కు తగ్గట్లుగా ఫ్రీడమ్ అండ్ పులి కాన్సెప్ట్ లో ఒక ట్రావెల్ వీడియోను రెడీ చేస్తున్నాడు.
త్వరలోనే ఫుల్ వీడియో
ఇటీవల అభిజీత్ ఫారెస్ట్ ను చుట్టేసినట్లు తెలుస్తోంది. వీడియో ఫుటేజ్ కోసం స్పెషల్ గా ఒక సెటప్ రెడీ చేసుకొని వెళ్లినట్లు చిన్న వీడియోలో చెప్పాడు. స్పెషల్ గా బైక్ వేసుకొని చేతిలో కెమెరా పట్టుకొని టైగర్స్ ఫొటోలను తీయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక అడవిలో తిరిగే టైగర్స్ ను ఫొటోలు తీస్తుంటే కొంతమంది ఫ్యాన్స్ అభిజిత్ తో ఫొటోలు కూడా దిగారట. త్వరలోనే ఆ ఫుల్ వీడియోను యూ ట్యూబ్ లో పోస్ట్ చేయనున్నట్లు ఈ బిగ్ బాస్ విన్నర్ వివరణ ఇచ్చాడు.